రాశిఫలాలు 9, అక్టోబర్ 2018..!

మేషం: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక పెట్టుబడుల గురించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. విలువైన వస్తువులపై దృష్టి సారిస్తారు. మీ సహాయం ఆర్థించి మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు ఉంటారు. మీ ఆలోచనలు పంచుకునే వారి కోసం మనసు తహతహలాడుతుంది.

వృషభం: కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆత్మీయుల గురించి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వివాహ నిర్ణయం అనుకూలం. విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విద్యా విషయాల గురించి నూతన ఆలోచనలు చేస్తారు.
 
మిథునం: పై అధికారులతో అనుబంధం ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు, ఉన్నత పదవులు లభిస్తాయి. పదవీ స్వీకారాలకు, వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. టీవీ, మీడియా రంగాలలోని వారికి లాభప్రదం. విదేశాలు వెళ్లేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: దంపతుల మధ్య చికాకులు తలెత్తినా, నెమ్మదిగా సమసిపోతాయి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్మికులకు ఆందోళన అధికమవుతుంది. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు.
 
సింహం: ఇంటా, బయటా ఆనందకర వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంటుంది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్మాణ పథకాలలో సంతృప్తి చేకూరుతుంది. వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
కన్య: కార్యాలయంలో కొత్త పరచయాలు ఏర్పడతాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి విద్యా కోర్సులలో రాణిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ప్రముఖులకు కానుకలు, శుభాకాంక్షలందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీలకు లాభం.
 
తుల: బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి. కళా, ఫొటోగ్రఫీ, రంగాల వారికి అనుకూల సమయం. వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. వ్యవసాయ ఎగుమతి, దిగుమతులు లాభిస్తాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. ముందుచూపుతో వ్యవహరించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి.
 
వృశ్చికం: ఓ సృజనాత్మక ప్రాజెక్టును చేపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆశించినంత ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. పరిశోధనలు, సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తత అవసరం.
 
ధనస్సు: శుభకార్యాల రీత్యా ధనం వ్యయం చేస్తారు. విహార యాత్రలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ప్రముఖులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పనులు వాయిదా పడతాయి.
 
మకరం: నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి వ్యాపార రంగాల్లోని వారికి సహచరుల మద్దతు లభిస్తుంది. జన సంబంధాలు మెరుగుపడతాయి. మీ శ్రీమతి ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపిస్తారు. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో పాలు పంచుకుంటారు. వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. లక్ష్యసాధనలో మీ అనుభవం ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు తగిన సమయం. స్త్రీలకు తమ బంధువర్గాల నుండి శుభవార్తలు అందుతాయి. ఖర్చులు అధికం.
 
మీనం: ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానం మొండివైఖరి కారణంగా చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి. మీ నుంచి కొంతమంది ముఖ్యమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. సన్నిహితుల ద్వారా అందిన ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది.
 
 
©2019 APWebNews.com. All Rights Reserved.