రాశిఫలాలు 12,సెప్టెంబర్ 2018

మేషం
హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. స్నేహితులపై మరింత ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి.
వృషభం
రాజకీయాల్లో వారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. భార్యా, భర్తల మధ్య ఏకీభావం కుదరదు. బ్యాంక్ వ్యవహారాలు మంద కొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం.
మిథునం
ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకం. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్‌వర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్నేహితుల సహకారంతో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం.
కర్కాటకం
ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. పత్రికా రంగంలోని వారికి గుర్తంపు రాణింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్ఫర్ధలు తలెత్తుతాయి.
సింహం
ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్ఫర్ధలు తలెత్తుతాయి.
కన్య
ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్, రంగాల వారికి పురోభివృద్ధి. నూతన వ్యాపారాలకు తగిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలకు సమాధాన పరుస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
తుల
ఉద్యోగస్తులకు పై అధికారులతో అప్రమత్తత అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. బంధువుల మిత్రులతో కలసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. స్వయం కృషితో రాణిస్తారు.
వృశ్చికం
ప్రియతముల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. పై చదువుల విషయంలో విద్యార్ధుల ఆసక్తిని తల్లిదండ్లులు ప్రోత్సహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
ధనస్సు
కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గ్రహించండి. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్సులు మంజూరవుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.
మకరం
నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆపద సమయంలో బంధుమిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కుంభం
రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి పురోభివృద్ధి. తలపెట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
మీనం
ఒక స్థిరాస్థిని అమర్చుకుంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
©2019 APWebNews.com. All Rights Reserved.