వారఫలం (10 - 17 సెప్టెంబర్ 2018)

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మీ ఇంట ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ మంటపాలకు అన్వేషణ సాగిస్తారు. మీ యత్నాల్లో నిర్లక్ష్యం, పనులు వాయిదా కూడదు. మీ సంతానం విద్యా ఫీజులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు సన్నిహితులకు ద్వారా ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి అభిప్రాయాలను తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం, టీవీ ఛానళ్ల నుంచి బహుమతులు అందుతాయి. వృత్తి ఉద్యోగ నైపుణ్యతను పెంచుకోవటానికి శ్రమించండి. ఇతరుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వక సొంతంగా ఆలోచించటం క్షేమదాయకం. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఉపందుకుంటాయి. గృహ వాస్తుదోషాలకు తక్షణం నివారించుకోవటం క్షేమదాయకం. ఉన్నతాధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం వంటి ఫలితాలున్నాయి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. సేవా సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ వారం వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. నూతన వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామికంగా కంటే సొంతగానే అభివృద్ధి చెందుతారు. ఖర్చులు పెరిగినా మీ ఆర్థికస్థితికి లోటుండదు. కష్టసమయంలో సన్నిహితులు తోడుగా నిలుస్తారు. దంపతుల మధ్య పట్టింపులు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మీ బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందులెదుర్కొంచారు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. హామీలు, మధ్యవర్తిత్వాలు, వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మీతో సఖ్యత నటిస్తూనే కొంత మంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రేమికులకు పెద్దల వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం. వాహానం ఎకాగ్రతతో నడపండి. షేర్ల కొనుగోళ్లు లాభిస్తాయి.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆర్థికలావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. ఆదాయవ్యయాలు మీ అంచనాలకు తగ్గటుగానే ఉంటాయి. మీ యత్నాలు గుట్టుగా సాగించాలి. అవివాహితులకు శుభదాయకం. ఆత్మీయుల ఇంట ఒక శుభకార్యానికి హాజరవుతారు. స్త్రీలకు ఆదరణ, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు, పనిభారం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. శంకుస్థాపనలు, నూతన వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. అపరిచిత విషయాలకు దూరంగా ఉండాలి. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆస్తి పంపకాల సమస్య సానుకూలమవుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. కోర్టు దావాలు, కేసులు ఉపసంహరించుకొంటారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష బంధుమిత్రులతో విభేదాలు, ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటారు. ఓర్పుతో సర్దుకుపోవటం క్షేమదాయకం. ఆది, సోమ వారాల్లో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనవ్యయంలో జాగ్రత్త. స్త్రీలతో మితంగా సంభాషించాలి. మీ శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆత్మీయుల హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. షాపుల్లో పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. భాగస్వామిక ఒప్పందాల్లో మెలకువ వహించండి. గృహవాస్తు దోష నివారణ వల్ల అనుకూల ఫలితాలు పొందగలరు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి అధికం. ఉన్నతాధికారుల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తాయి. వృత్తి నైపుణ్యం పెంచుకోవటానికి బాగా శ్రమించాలి. విద్యార్థులకు ఏకాగ్రత, సహచరుల సాన్నిత్యం నెలకొంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలు విచారణకు రాగలవు. లీజు, ఏజెన్సీల గడువు పెంపునకు అనుకూలం.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వృత్తి ఉద్యోగాల్లో ఏ మార్పు, పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు, ఆకస్మిక స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. మంగళ, బుధ వారాల్లో ఆదాయానికి మించి ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. ధనసహాయం అర్ధించటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. మీ అవసరాలు ఏదో విధంగా నెరవేరగలవు. వ్యాపారాల విస్తరణలు, భాగస్వామిక వ్యాపారాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. చేపట్టిన పనులు మెక్కుబడిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఇంట ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అప్రయత్నంగా ఒక మంచి అవకాశం కలసివస్తుంది. తక్షణం సద్వినియోగించుకోవటం ఉత్తమం. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి ఇబ్బందులెదుర్కొంటారు. విద్యార్థునుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. ప్రయణాలు ఉల్లాసంగా సాగుతాయి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, ఏ వ్యవహారం కలసిరాక నిరుత్సాహం చెందుతారు. గురు, శుక్రవారాల్లో మీ పనులు సానుకూలతకు ఓర్పు, పట్టుదలతో శ్రమించాలి. మీ జీవితభాగస్వామి హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. గృహవాస్తును పరిశీలించుకోవటం క్షేమదాయకం. ఒక శుభకార్యానికి వెళ్లే విషయంలో సందిగ్ధానికి లోనవుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి పనివారల నిర్లక్ష్యం, అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. లీజు. ఏజెన్సీల గడువు పొడిగింపు, నూతన వ్యాపారాలకు మరి కొంత కాలం ఆగటం ఉత్తమం. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞులను సంప్రదించండి. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లేకపోగా విమర్శలెదురవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. బంధువుల రాకతో ఇబ్బందులెదుర్కొంటారు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఇంటా ఒక శుభకార్యానికి హాజరవుతారు. శనివారం నాడు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటకు మంచి స్పందన వస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం క్షేమదాయకం. నూతన వ్యాపారాల్లో అనుభవం, స్వల్ప లాభాలు గడిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు మీకు కలసిరావని గమనించండి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. మీ శ్రీమతి, సంతానం కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, సహూద్యోగుల ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం. స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. పూర్వ విద్యార్థుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట వ్యాపారా, ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. ఇంట ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. అర్థంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన, అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. అవివాహిల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఆది, సోమ వారాల్లో ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. అదనపు రాబడికి మార్గాలు అన్వేషిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి బహుమతులు, ఆహ్వానం అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పరీక్షల్లో ఏకాగ్రత్త ముఖ్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ, నిద్రలేమి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం చదువులు, కదలికలపై శ్రద్ధ అవసరం. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల గడువు పెంపునకు అనుకూలం. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి చికాకులు అధికం.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వేడుకలు, శుభకార్యాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఆత్మీయుల నడుమ పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది. ధనవ్యయంలో మితం పాటించండి. ఏ పనీ సవ్యంగా సాగక అసహానికి లోనవుతారు. స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్యసేవలు అవసరమవుతాయి. మంగళ, బుధ వారాల్లో చెక్కులు, హామీలిచ్చే విషయంలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు అధికారుల బదిలీ వార్త సంతోషం కలిగిస్తుంది. సహూద్యోగులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారలపై ప్రభావం చూపుతుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం.

మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఏ వ్యవహారం కలసిరాక నిరుత్సాహం చెందుతారు. మీ అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది, గురు వారాల్లో గత తప్పిదాలు పునరావృత్తమయ్యే ఆస్కారం ఉంది. ఆదాయానికి మించి ఖర్చులు, ధనం సమయానికి అందక ఒకింత ఇబ్బందులు తప్పవు. ఆత్మీయులతో మాకష్టాలు చెప్పుకోవటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. పొరుగు వారి నుంచి ఆహ్వానం అందుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యభంగం, ఔషధ సేవనం తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. పత్రికా సంస్థలలోని వారికి మార్పలు అనుకూలిస్తాయి. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. కోర్టు పనుల్లో ప్లీడర్ల, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఒక శుభకార్యం దగ్గరపడుతున్న కొద్దీ మీలో ఒత్తిడి, హడావుడి అధికమవుతాయి. మంగళ, శని వారాల్లో చిన్న చిన్న తప్పిదాలకు సైతం వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగ్గటుగానే ఉంటాయి. మీ సంతానం ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితులకు చేదోడుగా నిలుస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు మరి కొంత కాలం పడుతుంది. దంపతుల మధ్య సఖ్యతల లోపం, చికాకులు చోటు చేసుకుంటాయి. వృత్తినైపుణ్యం పెంచుకోవాలి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, స్థానచలనం ఆందోళన కలిగిస్తాయి. ప్రైవేట్ సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. గృహ వాస్తుదోష నివారణతో మంచి ఫలితాలుంటాయి. వాహనం జాగ్రత్తగా నడపాలి. స్త్రీలకు షాపింగ్‌లోను, అపరిచిత వ్యక్తుల విషయంలోను జాగ్రత్తగా ఉండాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. అయిన వారే మీకు ధనసాహాయం చేసేందుకు వెనుకాడుతారు. గురు, శుక్రవారాల్లో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవటం ఉత్తమం. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలు జరిగే ఆస్కారం ఉంది. గృహంలో ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. నూతన వ్యాపారాలు, సంస్థలు ఫర్వాలేదనిపిస్తాయి. కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు అంతంత మాత్రమే. పత్రికా సంస్థలోని వారికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ముఖ్యం. స్త్రీల ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం ఉండదు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు తప్పవు. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.