రాశిఫలాలు 9,సెప్టెంబర్ 2018

మేషం
విద్యా రంగంలో వారికి నూతన ఉత్సాహం కానరాగలదు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. స్త్రీల పట్టుదలతో వ్యవహరించటం వల్ల సమసలెదుర్కోవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. సన్నిహితులతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం
విలువైన వస్తువులు, కీలకమైన పత్రాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తి కాకపోవటం లేక వాయిదా పడటం వంటి పరిణామాలు ఎదుర్కుంటారు. మీ మాటకు కుటుంబంలోనూ, సంఘంలోనూ గౌరవం, ఆదరణ లభిస్తాయి. ప్రయాణాలలో సంతృప్తి కానరాదు.
మిథునం
ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ప్రైవేట్ సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం
ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. నిరుద్యోగులకు నిరుత్సాహం, నిర్లప్తత తప్పవు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకుని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి.
సింహం
కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెలకువ అవసరం. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించటం మంచిది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థిక పరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం.
కన్య
ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలసిరాగలదు. నిరుద్యోగులకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. స్పెక్యులేషన్ కలిసిరాదు.
తుల
కొత్త వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోస్టల్, ఎల్.ఐ.సి ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పురోభివృద్ధి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం
సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఓర్పు, లౌక్యం చాలా ముఖ్యం. పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు ఆశాజనకం. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పుట తప్పవు. కళాకారులకు, రచయితలకు ప్రోత్సాహకరం.
ధనస్సు
కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. చిన్న చిన్న విషయాలలో మానసిక ఆందోళనకు గురవక తప్పదు.
మకరం
ఉద్యోగులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో చికాకులు తప్పవు. ఆకస్మిక ఖర్చులు, ధనం చేజారిపోవటం వంటి సమస్యలు తప్పవు. నూతన వ్యాపారాలు చేపట్టాలనే విషయంలో పునరాలోచన అవసరం. ప్రేమానుబంధాలు బలపడతాయి.
కుంభం
మీ అభిలాషలు నెరవేరే సమయం ఆసన్నమయిందని గమనించండి. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. విద్యుత్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంగారం, వెండి, లోహ, వస్త్ర రంగాలలో వారికి మందకొడిగా ఉండగలదు. ఇన్సూరెన్స్ రంగాలలో వారికి శుభదాయకం.
మీనం
చేపల చెరువులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాణిజ్య రంగాలలో వారికి చురుకుదనం కానరాగలదు. శ్రమాధిక్యత, ఓర్పుతో అనుకున్నది సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాల్లో మెళుకువ అవసరం.
©2019 APWebNews.com. All Rights Reserved.