రాశిఫలాలు 7,సెప్టెంబర్ 2018

 

మేషం
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
వృషభం
హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. భాగస్వాములతో విబేధాలు తలెత్తే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగల్గుతారు. ఖర్చులు అధికమవుతాయి.
మిథునం
రాజకీయ నాయకులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడును. ప్రత్యర్ధులు మిత్రులుగా మారతారు. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటకం
పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఉన్నతంగా ఎదగాలనే మీ లక్ష్యానికి చేరువవుతారు.
సింహం
ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. నూతన అగ్రిమెంట్లు వాయిదా వేయండి. ఇతరుల మీ నుంచి ఏమి కోరుకుంటున్నారో ముందు తెలుసుకోండి.
కన్య
లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. బంధు మిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఊహించని ఖర్చుల వల్ల స్పల్ప ఆటుపోట్లు తప్పవు. పొదుపు చేయాలనే ప్రయత్నం ఫలించదు.
తుల
విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకున్నవి సాధించే విషయంలో రాజీ పడవద్దు. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారికి అనుకూలం. నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. దంపతులు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు.
వృశ్చికం
పత్రిక, వార్తా సంస్థలోని వారికి సదవకాశాలు లభిస్తాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతదారులతో సమస్యలు తప్పవు. స్త్రీలతో మితంగా సంభాషించండి. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. దూర ప్రయాణాలలో వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి.
ధనస్సు
మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. చిన్న తరహా, చిరువృత్తుల వారిక సరైన తృప్తి లభిస్తుంది. దంపతుల మధ్య నూతన విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కొత్త షేర్ల కొనుగోళ్లలో పునరాలోచన అవసరం. అవివాహితులకు శుధదాయకం.
మకరం
ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరుత్సాహం తప్పదు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయవచ్చు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
కుంభం
ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. కోళ్ల, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి. స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడగలవు. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యం.
మీనం
ఉమ్మడి వ్యవహారాలు , ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. మీ చుట్టు ప్రక్కల వారి ధోరణి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంటి పనులలో నిమగ్నం అవుతారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంలో మెళుకువ అవసరం.
©2018 APWebNews.com. All Rights Reserved.