రాశిఫలాలు ఆగష్టు 10, 2018

 

 
మేషం
ప్రియతములతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికులు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకతను, ఇతరత్రా చిక్కులను ఎదుర్కొంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది.
వృషభం
స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. ఖర్చులు అధికంగా ఉన్నా, ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. షాపింగ్ వ్యవహారాలలో అపరిచితులపట్ల మెలకువ వహించండి. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఏ పని తలపెట్టినా పూర్తి చేయలేరు.
మిథునం
ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, వివాదాలకు దారి తీస్తుంది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాలలోని వారికి అనుకూలమైన కాలం.
కర్కాటకం
ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాల్ వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
సింహం
అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. లీజు, ఏజెన్సీ, ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చికాకులు తప్పవు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గతంలో మిమ్మల్ని విమర్శించినవారే మీ సహాయం అర్థిస్తారు.
కన్య
కార్యసాధనలో పట్టుదల ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
తుల
ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగుల లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి.
వృశ్చికం
గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రాజకీయాలలోని వారి కార్యక్రమాలు వాయిదా పడటంవల్ల ఆందోళనకు గురవుతారు. సృజనాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే లక్ష్యసాధన వీలవుతుందని గ్రహించండి. శుభవార్తలు వింటారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు.
ధనస్సు
ఆర్థిక విషయాలలో గోప్యంగా వ్యవహరిస్తారు. దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి ప్రోత్సాహం, ధనం చేతికి అందుతాయి. విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరపుతారు. ప్రయాణాలలో మెలకువ అవసరం.
మకరం
కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రముఖుల కోసం షాపింగ్‌లు చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకులను కలిగిస్తుంది. రావలసిన ధనం చేతికి అందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. సమావేశాల్లో మెలకువగా వ్యవహరించండి. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ప్రముఖులను కలుస్తారు.
కుంభం
వృత్తిపరమైన చికాకులు ఎదురవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు నూతనోత్సాహం కలిగిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కొబ్బరి, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసిరాగలదు. దంపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి.
మీనం
అనుకున్న పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మిత్రులకు సహకరించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి.
©2019 APWebNews.com. All Rights Reserved.