రాశిఫలాలు 13 జులై 2018..!

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రేమాను బంధాలు, ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పువు.
 
 
వృషభం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సామాన్యంగా ఉంటాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. ముఖ్యుల ఆరోగ్యము మిమ్మల్ని నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఊహగానలతో కాలం వ్యర్ధం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి.
 
 
మిధునం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవజ్ఞుల సలహా పాటించండి.
 
 
కర్కాటకం: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మీరు ఆశించిన మార్పు సంభవిస్తుంది. విద్యార్థులకు రెండవ విడత కౌన్సెలింగ్ అనుకూలం. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయ సంతృప్తి ఉండదు. అధికారుల, ప్రముఖుల ఇంటర్వ్యూకోసం నిరీక్షిణ తప్పదు.
 
 
సింహం: ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తె ఆస్కారం ఉంది మెళకువ వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
 
కన్య: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలా మందకొడిగా సాగుతాయి. ఏ విషయంలోను తొందరపడి మాట ఇవ్వడం శ్రేయస్కరం కాదు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. తలపెట్టిన పనులు చురుకుగా సాగుతాయి.
 
 
తుల: ప్రింటింగ్ రంగాలవారికి బకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. క్రమవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు విదేశీ చదువులకోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు.
 
 
వృశ్చికం: వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. మీ ఊహలు, అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రియల్‌ఎస్టేట్, చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఆటుపోట్లు అధికమవుతాయి.
 
 
ధనస్సు: అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు.
 
 
మకరం: విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులు ఉల్లాసంగా గడుపుతారు. సిమెంటు, ఇసుక, ఇటుక, తాపి పనివారికి చికాకులు అధికమవుతాయి. మాట్లాటలేనిచోట మౌనం వహించడం మంచిది. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
 
 
కుంభం: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రైతులు వ్యవసాయ రుణాలు, విత్తనాల కోసం ఆందోళం చెందుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ప్రయాణాల వలన అధిక ధనవ్యయం అవుతుంది. బంధువుల నుండి ఒత్తిడి మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు.
 
 
మీనం: విద్యార్థులకు టెక్నికల్, కంప్యూటర్ సైన్స్‌లో ప్రవేశం లభిస్తుంది. కొంతమంది మీ పలుకుబడిని దుర్వినియోగం చేయడం వలన మాటపడవలసి వస్తుంది. రచయితలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తడి ఎదుర్కొనక తప్పదు. బంధుమిత్రుల పట్ల సంయమనం పాటించండి.
©2019 APWebNews.com. All Rights Reserved.