రాశిఫలాలు 12 జులై 2018..!

మేషం: విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. గృహ మరమ్మత్తులు వాయిదా పడుతాయి. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కుంటారు. ప్రయాణాలలలో వస్తువుల పట్ల మెళకువ వహించండి. పరిచయాలు మరింతగా బలపడుతాయి.

వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
 
మిధునం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారులకు కావలసిన పెట్టుబడులు వాయిదా పడుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
 
కర్కాటకం: దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
 
సింహం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. లాయర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు చుట్టు పక్కలవారితో విబేధాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మెుండిధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. సోదరులకు మీ వంతు సహాయ సహాకారాలు అందిస్తారు.
 
కన్య: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. అనుకున్న పనులలో ఏకాగ్రత లోపం వలన చికాకులు వంటివి ఎదుర్కోక తప్పదు.
 
 
తుల: ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. హోటల్, తినుంబడారాల వ్యాపారస్తులకు లాభాదయకం. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. స్త్రీలు టీ.వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
 
వృశ్చికం: వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. అధికారులకు పర్యటనలు, తనిఖీలు అధికం. స్పెక్యులేషన్ రంగాలవారి అంచనాలు తారుమారవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలల్లో మిత్రుల సలహాపాటిస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది.
 
 
ధనస్సు: కళ, క్రీడ, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పై ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామిక వ్యాపారాలనుండి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. చేయని యత్నాలకు ప్రతిఫలం ఆశించకండి.
 
 
మకరం: మీకు రాబోయే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధమవుతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పాత సమస్యలు పరిష్కరిస్తారు. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి.
 
 
కుంభం: ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. మీ శ్రీమతి తీరు చికాకు కలిగిస్తుంది. రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడుతాయి.
 
 
మీనం: ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వ్యాజ్యాలు, వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎదుటివారు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది.
©2019 APWebNews.com. All Rights Reserved.