రాశిఫలాలు 10 జులై 2018..!

 

 
మేషం
మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటం కూడదు. స్త్రీలకు టి.వి కార్యక్రమాల సమాచారం అందుతుంది. పత్రికా సంస్థలలోని వారికి సహోద్యోగుల ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృషభం
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా నడుస్తాయి. రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం
ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తప్పవు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందుకెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది.
 
కర్కాటకం
ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. వస్త్ర, ఫోము, లెదర్, పీచు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. రావలసిన సకాలంలో ధనం అందుతుంది.
 
సింహం
కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్ధులు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి.
 
కన్య
సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు.
 
తుల
భాగస్వామిక సమావేశాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. అసాధ్యమనుకున్న పనులు సునాయసంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు నరాలు, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తుల సమర్ధత, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటాయి.
 
వృశ్చికం
విద్యార్ధులు వాహనం వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించాలి. గృహ మార్పు కోసం యత్నాలు సాగిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒత్తిడికి గురవుతారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ప్రైవేటు సంస్థలలోని వారు నిగ్రహంతో వ్యవహరించాలి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
ధనస్సు
వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లు విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు. మీ అభిప్రాయాలు, ఆలోచనలకు మిశ్రమ స్పందన పొందుతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
మకరం
మిమ్ములను పొగిడిన వారే విమర్శించటానికి వెనుకాడరు. ప్రయాణాల విసుగు కలిగిస్తాయి. మనోధైర్యం, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
కుంభం
వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. స్త్రీలకు టి.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికం. చేపట్టిన పనులు అతికష్టం మీద సమయానికి పూర్తి చేయగల్గుతారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మీనం
ఏ వ్యవహారం తలపెట్టినా గోప్యంగా వ్యవహరించాలి. వాణిజ్య ఒప్పందాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడుల విషయంలో ఏకాగ్రత వహించండి. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.
©2019 APWebNews.com. All Rights Reserved.