రాశిఫలాలు జూలై 9, 2018

మేషం: ఉద్యోగస్తులకు రావలసిన అరియర్స్, అడ్వాస్సులు మంజూరవుతాయి. ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్మికులకు, పారిశ్రామికులకు పరస్పర అవగాహన కుదురుతుంది.
 
 
వృషభం: మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. బంధువుల నుండి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలను కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు.
 
 
మిధునం: స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం.
 
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సఖ్యత నెలకొంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించడం క్షేమదాయకం. మీ పనితీరును, వ్యవహార దక్షతలను ఎదుటివారు గుర్తిస్తారు.
 
 
సింహం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారితో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. కోర్టువ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
 
కన్య: నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి.
 
 
తుల: రాజకీయాలలోని వారు విరోధులు వేసే పథకాలను త్రిప్పి కొడతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం వహించుట వలన మాటపడవలసి వస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలెపెడతారు. సేవా, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన చోదకులకు మెళకువ అవసరం. అంతర్గత సమస్యలను అధిగమిస్తారు.
 
 
వృశ్చికం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించడం వలన భంగపాటు తప్పదు. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాలల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు మెళకువ అవసరం. అంతర్గత సమస్యలను అధిగమిస్తారు.
 
 
ధనస్సు: బంధువులతో సత్సంబంధాలు సన్నగిల్లుతాయి. విదేశాల నుండి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. ధనవ్యయం అధికమవుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఋణ విమోచన విషయాలు చర్చిస్తారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ప్రయాణముల యందు చెడుస్నేహాల వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు.
 
 
మకరం: స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన అధికమగును. శ్రమాధిక్యత వలన ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి ఉద్యోగముస యందు గౌరవంతో నడుచుకోగలుగుతారు. ప్రేమ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును.
 
 
కుంభం: బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థులలో ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఆధ్యాత్మిక సమావేశాలు, సభలలో పాల్గొంటారు.
 
 
మీనం: వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పారిశ్రామిక రంగాలవారికి కార్మిక సమస్యలు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాలలో వారికి సత్‌కాలం. గృహంలో శుభకార్యం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది.
 
©2019 APWebNews.com. All Rights Reserved.