వారఫలాలు జూలై 9 -16, 2018

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మీ లక్ష్యసాధనకు బాగా శ్రమిస్తారు. గత కొంత కాలంగా మిమ్ములను చికాకు పరుస్తున్న సమస్య సునాయాసంగా పరిష్కారమవుతుంది. దైవదర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీ పనులు కార్యక్రమాల్లో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. గురు, శుక్రవారాల్లో హడావుడిగా ఉంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ యత్నాలు గుట్టుగా సాగించాలి. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్లీడరు నోటీసులు ఆందోళన కలిగిస్తాయి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. విద్యార్థులు ఉన్నత విద్యా యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు దైవకార్యాలు, కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. మీ నుంచి విషయాలు సేకరించడానికి కొంతమంది యత్నిస్తారు. అందరితో వీలైనంత క్లుప్తంగా మాట్లాడండి. శనివారం నాడు మీ కుటుంబ విషయాలు ఇతరుల ముందు ఏకరవు పెట్టడం మంచిది కాదు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి కాగలవు. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మీ సంతానం విద్యా, వివాహ, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీకందిన ఒక సమాచారం ఆలోచింపజేసేదిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉపాథి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. పెండింగ్ పనులు పూర్తి కావడంతో ఉద్యోగస్తులు కుదుటపడతారు. పారిశ్రామికవేత్తలకు, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోళ్లలో చికాకులు తప్పవు. వాహనం నిదానంగా నడపండి.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ వారం అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. మీ మాటతీరు, పద్ధతులు ప్రముఖులను ఆకట్టుకుంటాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కుటుంబ ఖర్చులు అధికం. ఇంటి అద్దెలు, పాత బకాయిలు వసూలు కాగలవు. వ్యాపార, ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణలు, గృహ నిర్మాణాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. మీరు ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు మనస్పర్దలకు దారితీస్తాయి. దాంపత్యసుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. మీ సంతానం సాధించిన విజయం సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లో ఏకాగ్రత ముఖ్యం. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం వల్ల చులకనయ్యే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారుల హోదా పెరగడంతో పాటు స్థానచలనం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు పనులు, ప్రయాణాల్లో ఏకాగ్రత అవసరం. గృహమార్పు వల్ల ప్రయోజనం ఉంటుంది.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు పెరిగినా మీ అవసరాలు గడిచిపోగలవు. ఓర్పు, విజ్ఞతతో వ్యవహరించాలి. సోదరులతో పట్టింపులు, కుటుంబ కలహాలు ఎదుర్కుంటారు. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. మీ పనులు, వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఆధ్యాత్మిక విషయాలు, పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్నపట్టుదల అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఒక దానిలో వచ్చిన నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకోగలుగుతారు. ఏజెంట్లు, బ్రోకర్లు, కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులు, తోటివారికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం ఉత్తమం. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలించవచ్చు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. మీ మనస్సును, ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం బంధుమిత్రులు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఒక సమస్య సుఖాంతంగా పరిష్కారమవుతుంది. దైవకార్యాలు, కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఆది, సోమవారాల్లో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు అవకాశమివ్వండి. ప్రకటనలు, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త. స్త్రీలు అయిన వారికి వివాహ సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి చికాకులు తప్పవు. టెండర్లు, లీజు, ఏజెన్సీలు, స్థిరాస్తుల కొనుగోలులో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు నగదు బహుమతి, ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి శుభఫలితాలున్నాయి. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆర్థిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేయటం మంచిది. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయమే అన్ని విధాలా శ్రేయస్కరం. మంగళ, బుధవారాల్లో బంధువులతో పట్టింపులు, ఆస్తి వివాదాలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఖర్చులు సామాన్యం. ధనవ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ శ్రీమతితోను, పిల్లలతోను అనునయంగా మెలగాలి. చేపట్టిన పనుల్లో ఆసక్తి అంతగా ఉండదు. దైవదర్శనం, ఆధ్యాత్మిక విషయాల పట్ల దృష్టి సారిస్తారు. వృత్తివ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. స్త్రీలకు రుతు సంబంధిత చికాకులెదుర్కోవలసి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. పత్రికా సంస్థల్లోని వారికి ఏకాగ్రత ముఖ్యం. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం ఆశించినంతగా ఉండదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. వైద్య రంగాల వారు అరుదైన శస్త్రచికత్సలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రముఖుల కోసం నిరీక్షణ తప్పదు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ గౌరవానికి భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించి వ్యయం చేయవలసి వస్తుంది. రుణాలు, చేబుదుళ్లు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. సత్ఫలితాలు లభిస్తాయి. మీ సంతానానికి దూర ప్రదేశంలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గురు, శుక్రవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం కూడదు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. అధికారులు, సహోద్యోగులతో లౌక్యంగా వ్యవహరించాలి. స్త్రీలు టీవీ ఛానళ్ల కార్యక్రమాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు అధికం. ఆస్తి, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఆర్థిక స్థితి ఆశాజనకం. ఖర్చులు ప్రయోజనకరం. రుణాలు తీర్చి తాకట్టు విడిపించుకుంటారు. ఇంటా బయటా మీ మాటే చెల్లుబాటుఅవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మ శ్రీమతి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. శనివారం నాడు మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దైవదర్శనాలు మనశ్శాంతినిస్తాయి. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. ఒక విషయంలో మీ ఆలోచనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. విద్యార్థులు సహచరులు, నూతన వాతావరణానికి క్రమంగా అలవాటుపడతారు. క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు సన్మాన సభలు, యూనియన్ వ్యవహారాల్లో హడావుడిగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అప్రయత్నంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ఖర్చులు మీ స్థోమతకు తగినట్టుగానే ఉంటాయి. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. భేషజాలకు పోకుండా ఇతరుల సహాయాన్ని స్వీకరించండి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. గృహ మార్పు వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆది, సోమవారాల్లో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దాంపత్యసుఖం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెలకువ వహించండి. పాతమిత్రులు, ఆత్మీయులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు, ఉపాథి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. విద్యార్థినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తి పంపకాల్లో పెద్దల నిర్ణయాన్ని శిరసావహిస్తారు. కోర్టు తీర్పులు మీకే అనుకూలం.

మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతనం వల్ల ధననష్టంతో పాటు మాటపడవలసి వస్తుంది. మంగళ, బుధవారాల్లో తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి శ్రీకారం చుడతారు. సర్దుబాటు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం, అధికారుల మన్ననలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాథి పథకాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది. పత్రికా, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. స్త్రీలకు ధనప్రాప్తి, వస్త్రలాభం వంటి శుభఫలితాలున్నాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. ప్లీడరు నోటీసులకు ధీటుగా స్పందించారు. ప్రయాణంలో జాగ్రత్త.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. గత కొతం కాలంగా వేధిస్తున్న సమస్యలకు తెరపడుతుంది. మీ వ్యవహారజ్ఞానం, పట్టుదలతో ఒక అంశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబీకులు, అయిన వారి కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఆది, గురువారాల్లో ఎదురైన ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భాగస్వామిక సమావేశాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. అధికారుల సుదీర్ఘ సెలవుతో ఉద్యోగస్తులు నిశ్చింతకు లోనవుతారు. నిరుద్యోగులు ఉపాథి పథకాల్లో స్థిరపడతారు. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కోర్టు పనుల్లో ప్లీడర్లకు గుమస్తాలతో చికాకులు తప్పవు. ప్రేమికులు అతి ప్రవర్తన వివాదాస్పదమవుతుంది. మీ వాహనం మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు అనుకూలం.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి మీ యత్నాలు, వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలం కాగలదు. అయిన వారు, బంధువులు సహకరించలేదన్న మనస్థాపాన్ని వీడండి. మీ శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవద్దు. స్వయంకృషితోనే మీరు రాణిస్తారు. మంగళ, శనివారాల్లో హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. మీ అవసరాలు, చెల్లింపుల వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. పెద్దలు, మీ శ్రీమతి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. లీజు, టెండర్లు, ఏజెన్సీల వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడదు. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.

©2019 APWebNews.com. All Rights Reserved.