రాశిఫలాలు 11 జూన్ 2018

 
మేషం: రిప్రజెంటేటివ్‌లకు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. నిర్మాణ పనులలో అసంతృప్తి కానవస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ, విశ్రాంతిలోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం: కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యాక్రమాల్లో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మెుండి బాకీలు వసూలు కాగలవు. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత వహిస్తారు. వాహన చోదకులు సమస్యలను ఎదుర్కొనక తప్పదు.
మిధునం: బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు తోటివారి కారణంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు. కుటుంబీకులతో కొత్త విషయాలు చర్చిస్తారు. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: వ్యవసాయ, తోటల రంగంలోవారికి మార్పులు కానరాగలవు. బంధుమిత్రుల నుండి అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాలవారికి పనిభారం తప్పదు. ఆహ్వానాలు అందుకుంటారు.
 
సింహం: కంది, పసుపు, బెల్లం, చింతపండు వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెళకువ అవసరం. స్థిర, చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు.
 
కన్య: వ్యాపారాభివృద్ధికై నూతన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తుల శక్తి సామర్య్ధాలను అధికారులు గుర్తిస్తారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు అనుకూలం.
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు అధిక కృషిచేసి అధికారుల మెప్పు పొందుతారు. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
వృశ్చికం: ఊహించని ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అవగాహన లోపం అధికమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలకు ఆటంకాలు తప్పవు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యమని గమనించండి.
 
ధనస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబీకుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం, రుణ సహాకారం లభించగలవు. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటతీరు, పద్దతులను మార్చుకోవలసి ఉంటుంది.
 
మకరం: మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. వృత్తుల వారికి సదవకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి.
 
కుంభం: చిన్నతరహా పరిశ్రమలవారికి మిశ్రమ ఫలితం. ఇంజనీరింగి రంగాలవారికి చికాకులు తప్పవు. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొబ్బరి, మామిడి పండ్లు, చిరువ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది.
 
మీనం: ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాలవారికి పనిభారం తగ్గుతుంది. ఆత్మీయులు నుంచి కానుకలు అందుకుంటారు. కంప్యూటర్ రంగాలవారికి పురోభివృద్ధి. చేతివృత్తులవారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.
©2019 APWebNews.com. All Rights Reserved.