వారఫలాలు 11 - 18 జూన్ 2018

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ వారం వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశాల్లోని ఆత్మీయుల పలకరింపు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, ఉత్సాహం నెలకొంటాయి. మీలో నిస్తేజం తొలగి ఉత్సాహం నెలకొంటుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యసనాలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. క్రయ విక్రయాలు సంతృప్తికరం. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన ఆదాయాలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి.

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ వారం వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశాల్లోని ఆత్మీయుల పలకరింపు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, ఉత్సాహం నెలకొంటాయి. మీలో నిస్తేజం తొలగి ఉత్సాహం నెలకొంటుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యసనాలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. క్రయ విక్రయాలు సంతృప్తికరం. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన ఆదాయాలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి.

మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు నూతన పంపతుల మధ్య అవగాహన, ప్రేమానురాగాలు నెలకొంటాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో గణనీయమైన అభివృద్ధి, అనుభవం గడిస్తారు. కొత్త ఆలోచనలు, పథకాలతో ముందుకు సాగుతారు. వేడుకలు, వినోదాల్లో మితంగా ఉండాలి. ఖర్చులు విపరీతం. భేషజాలకు పోయి దుబారా ఖర్చులు చేస్తారు. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. భాగస్వామిక సమావేశాలు, ఒప్పందాలకు అనుకూలం. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. స్త్రీలకు అలంకరణ, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. వాహనచోదకులకు జరిమానాలు, మరమ్మతులు, చికాకులు అధికం. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కొన్ని అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ ఆథిపత్యం అన్నిచోట్ల పనిచేయక పోవచ్చు. కార్యసానుకూలతకు లౌక్యం, పట్టుదల ముఖ్యమని గమనించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఆది, సోమ వారాల్లో వివాదాస్పదమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలు జరిగే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన రాకపోవచ్చు. విద్యార్థులు క్రీడలు, క్యాంపస్ ఎంపికల్లో రాణిస్తారు. విందులు, వినోదాల్లో జాగ్రత్తగా మెలగాలి. వృత్తిపరమైన చికాకులను అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. దైవదర్శనాల్లో అసంతృప్తి, చికాకులు అధికం.

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కొన్ని అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ ఆథిపత్యం అన్నిచోట్ల పనిచేయక పోవచ్చు. కార్యసానుకూలతకు లౌక్యం, పట్టుదల ముఖ్యమని గమనించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఆది, సోమ వారాల్లో వివాదాస్పదమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల మేలు జరిగే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన రాకపోవచ్చు. విద్యార్థులు క్రీడలు, క్యాంపస్ ఎంపికల్లో రాణిస్తారు. విందులు, వినోదాల్లో జాగ్రత్తగా మెలగాలి. వృత్తిపరమైన చికాకులను అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. దైవదర్శనాల్లో అసంతృప్తి, చికాకులు అధికం.

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం విలాసాలకు భారీగా వ్యయం చేస్తారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం తగదు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలున్నాయి. మంగళ, బుధవారాల్లో పనులు అర్థాంతంగా ముగిస్తారు. కీలకమైన బాధ్యతలు, పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ పలుకుబడి గణనీయంగా విస్తరిస్తుంది. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. సేవ, దైవ సంస్థలకు విరాళాలు అందిస్తారు. కార్యక్రమాలు, ప్రయణాలు వాయిదా పడతాయి. కుటుంబంలో సందడి నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. పత్తి, మిర్చి రైతులకు ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.

కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు మీ శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం ఆలస్యంగా లభిస్తాయి. సంప్రదింపులు, ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అయిన వారే ఇరకాటానికి గురిచేస్తారు. దైవదర్శనాలు, వేడుకులు సంతృప్తినిస్తాయి. గురు, శుక్ర వారాల్లో ప్రముఖులు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆత్మీయులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలు అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఒక వ్యవహారం అనుకూలించటంతో స్థిమితపడతారు. దుబారా ఖర్చులు అధికం. విద్యుత్ బిల్లులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభిస్తాయి. ఆస్తి, కోర్టు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.

తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు రాబడికి మించి ఖర్చులుంటాయి. ఫిక్సెడ్ డిపాజిట్ల ధనం ముందుగా తీసుకోవలసి వస్తుంది. గృహోపకరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ సంతానం విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విదేశాల్లోని ఆత్మీయులతో ముచ్చటిస్తారు. కొత్త ఆలోచనలు, పథకాలతో యత్నాలు సాగిస్తారు. మీ సమస్యలకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. వృత్తి వ్యపారాల్లో ఆటంకాలు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. అధికారులు, సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. కౌలురైతులకు నిరుత్సాహం అధికం. వాహనం ఏకాగ్రతగా నడపండి.

వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట బంధువులతో పట్టింపులు తొలగి సాన్నిత్యం నెలకొంటుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. విలాసాలు, విందులు కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ఆది, సోమ వారాల్లో అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల్లో మెలకువ వహించండి. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులు సంభవం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించాలి. ఏజెంట్లు, బ్రోకర్లకు కలిసిరాగలదు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. బేకరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వస్త్ర వ్యాపారులకు ఒత్తిడి, చికాకులు అధికం.

ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. మీ తీరు కుటుంబీకులకు నచ్చకపోవచ్చు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒక స్ధిరాస్తి అమర్చుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి బహుమతులు, అవకాశాలు లభిస్తాయి. మంగళ, బుధవారాల్లో మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగాలు, ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. లక్ష్యసాధనకు బాగా శ్రమిస్తారు. మీ యత్నాలు వృధాకావు. ఆలస్యంగా అయినా మంచి ఫలితాలుంటాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్ధానచలనం తప్పవు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాస్తాయి. షాపు పనివారలు, కొనుగోలుదార్లతో లౌక్యంగా మెలగండి.

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు బంధువులకు మీరంటే ప్రత్యేకాభిమానం నెలకొంటుంది. పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కుంటారు. లీజు, కాంట్రాక్టులు, ఏజెన్సీలకు అనుకూలం. కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆది, గురు వారాల్లో బెట్టింగ్‌లు, జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్థిరచరమూలక ఆస్తుల మూలక ఆదాయం అందుతుంది. రుణ విముక్తులవుతారు. కొత్త రుణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, ఆల్కహాలు, బేకరి, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. దైవదర్శనంలో చికాకులు తప్పవు.

కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. వేడుకలు, దైవదర్శనాలతో మానసికంగా కుదుటపడతారు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. సేల్స్ సిబ్బంది చాకచక్యంతో విక్రయాలు ఊపందుకుంటాయి. మంగళ, శని వారాల్లో మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. కష్ట సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. ఖర్చులు, పెరిగిన ధరలు, విద్యుత్ ఛార్జీలు ఆందోళన కలిగిస్తాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆటుపోట్లు అధికం.

మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి వస్త్రాలు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. పనులు, కార్యక్రమాల్లో అవాంతరాలు అధికం. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెలకువ వహించండి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో వ్యవహరించాలి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రయణాలు, దైవదర్శనాల్లో ప్రయాసలెదుర్కుంటారు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు దూకుడు తగదు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. వరి, పత్తి, మిర్చి రైతులకు నిరుత్సాహం తప్పదు. వేడుకలు, విందులు, దైవకార్యాల్లో పాల్గొంటారు.

 
 
 
 
©2019 APWebNews.com. All Rights Reserved.