రాశిఫలాలు జూన్ 7, 2018

 
మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. నిరుద్యోగులకు రాత, మౌళిక పరీక్షలు అనుకూలిస్తాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆటుపోట్లు తప్పవు.
 
 
వృషభం: తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మనోధైర్యముతో ఎంతటి కార్యానైనా సాధించ గలుగుతారు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి.
 
 
మిధునం: భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పుతో పనిచేయవలసి ఉంటుంది. మెుక్కుబడులు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
 
కర్కాటకం: మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులెదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం.
 
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. నిత్యావసర వస్తుస్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలించవు. బంధువులరాకతో స్త్రీలలో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు.
 
 
కన్య: ఉద్యోగ, విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. పండ్ల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రయాణాలు, బ్యాంక్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. ఆధ్యాత్మిక, దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
 
తుల: ఆర్థికలావాదేవీలు, ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో మెలగవలసి ఉంటుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. సంతానంకోసం బాగా వ్యయంచేస్తారు. ఏ విషయంపై ఆసక్తి పెద్దగా ఉండదు.
 
 
వృశ్చికం: ఆర్థిక సమస్యలు, కుటుంబంలో చికాకులు సర్దుకుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసివస్తుంది. దైవకార్యాలలో పాల్గొంటారు.
 
 
ధనస్సు: ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాలవారికి చికాకులు తప్పవు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాభివృద్ధికై నూతన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి.
 
 
మకరం: ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. మీ మాటే నెగ్గాలన్న పట్టుదన మంచిదికాదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిదికాదు.
 
 
కుంభం: విద్యుత్, ఎ.సి. కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించండి. రాజకీయనాయకులకు విదేశీపర్యటనలు అనుకూలిస్తాయి.
 
 
మీనం: ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
©2019 APWebNews.com. All Rights Reserved.