తాజా వార్తలు

గ్రహబలం (ఫిబ్ర‌వ‌రి 11 - ఫిబ్ర‌వ‌రి 17)

 

మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

 క్రమంగా శుభయోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. దైవచింతనతో విఘ్నాలను అధిగమిస్తారు. శారీరక శక్తి లభిస్తుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగ అంశాల్లో మిశ్రమ ఫలితం. వారం మధ్యలో శుభం. ఖ్యాతి లభిస్తుంది. దగ్గరి వారికి మేలు జరుగుతుంది. సాయినామం ఉత్తమ ఫలాన్నిస్తుంది.


వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

తప్పనిసరైతే తప్ప ముఖ్యమైన కార్యాలను మొదలుపెట్టవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులున్నాయి. తోటివారి సహకారంతో విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశముంది. ఆత్మస్థైర్యం సర్వదా రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. వారాంతంలో మేలు జరుగుతుంది. రామరక్షా స్తోత్రం పఠించండి.


మిథునం

 

(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

 గొప్ప విజయాలు సొంతమవుతాయి. శుభయోగాలున్నాయి. భూలాభం ఉంది. ఆర్థికస్థితి బాగుంటుంది. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించి అధికారుల మన్ననలు పొందుతారు. భవిష్యత్తుకు మేలుచేసే పనులు చేపడతారు. మిత్రబలం పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.


కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

 సౌభాగ్య యోగముంది. తలచిన కార్యాలు శీఘ్రంగా పూర్తి అవుతాయి. కీర్తి లభిస్తుంది. జీవితాశయంవైపు అడుగులు వేస్తారు. పట్టుదల అధికమవుతుంది. ధనలాభం ఉంది. అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. కాలం వృథా కాకుండా జాగ్రత్తపడాలి.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ఆంజనేయ ప్రార్థన శుభదాయకం.


సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

మనోబలం వల్ల విజయం దక్కుతుంది. కొందరి సహకారంతో గొప్పవారు అవుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రశంసించేవారు పెరుగుతారు. ఆశయ సాధనలో అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధైర్యం అవసరం. ఆధ్యాత్మిక చింతన  రక్షిస్తుంది. విషయాలను మరీ లోతుగా ఆలోచించవద్దు. దుర్గా దర్శనం శుభప్రదం.


కన్య

 (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)

 అపోహల వల్ల అనవసరమైన భయాలు కలుగుతాయి. మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బుద్ధిబలంతో వారం మధ్యలో ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మ కార్యాచరణతో శాంతి 
నెలకొంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం చదవాలి.


తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)

గొప్ప విజయాలున్నాయి. మీ ఆలోచనలే మీ అదృష్టానికి బాటలు వేస్తాయి. కార్యసాధనలో శుభఫలితాలను సాధిస్తారు. అన్నివిధాలుగా పైకివచ్చే సమయమిది. చక్కని ప్రణాళికలు రచించి, ప్రతి క్షణాన్నీ అభివృద్ధికోసం వెచ్చించండి. ఆర్థికంగా బాగుంటుంది. కర్తవ్య నిర్వహణలో సంతృప్తి లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

గత వైభవం లభిస్తుంది. అదృష్టయోగం ఉంది. కష్టాలు క్రమంగా దూరమవుతాయి. విశేషమైన శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తగినంత విశ్రాంతి దొరుకుతుంది. చంద్రశ్లోకం చదువుకోవాలి.


ధనుస్సు 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

అఖండమైన కీర్తి, గౌరవం లభిస్తాయి. చేతినిండా ధనం ఉంటుంది. కష్టమైన పనుల్ని సైతం సునాయాసంగా చేయగలిగే శక్తిసామర్థ్యాలు లభిస్తాయి. కృషి ఫలిస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. వ్యతిరేక భావనల నుంచి అభివృద్ధి వైపు ఆలోచనలు సాగుతాయి. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. గణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది.


మకరం

(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)

విజయముంది. నిదానంగా పనులు ప్రారంభించండి. ప్రణాళికాబద్ధంగా ముందుకెళితే మంచి ఫలితాలను సాధిస్తారు. కష్టాలున్నాయి. శ్రమతో వాటిని అధిగమించొచ్చు. చంచలత్వం ఆవరిస్తుంది. అలసట అధికమవుతుంది. ముఖ్య వ్యక్తుల ప్రోత్సాహం లభిస్తుంది. బాగా ఆలోచించి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మహాలక్ష్మీ కటాక్షం ఉంది. సూర్యస్తుతి శక్తినిస్తుంది.


కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)

అద్భుతాలు సృష్టించే కాలమిది. మీ ఆలోచనలే మీ విజయానికి మూలం. ప్రశాంతమైన మనసుతో ముందుకెళితే తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. సాహసం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదన్నది నిరూపణ అవుతుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. సమస్యలు పరిష్కారమవుతాయి. ధనయోగముంది. ఇష్టదేవతా దర్శనం మంచి చేస్తుంది.


మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

సమయస్ఫూర్తితో కష్టాలు దూరమవుతాయి. మనశ్శాంతి లభిస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. శక్తివంచన లేకుండా పనిచేయండి. మీ మంచితనం అక్కరకు వస్తుంది. మంచి వార్తలు వింటారు. శత్రుదోషం తొలగుతుంది. వాదోపవాదాలు జరిగే సూచనలున్నాయి. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోండి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

©2018 ApWebNews.com. All Rights Reserved.