మేషం: రాజ కీయ, సినీ రంగాల వారికి జన సంబంధాలు విస్త రిస్తాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయా ణాలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామికి సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. వేడుకలు, ప్రదర్శనల్లో పాల్గొంటారు.

వృషభం: బంధు మిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూనియన్‌ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

మిథునం: ఉద్యోగ, వ్యాపారాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పొదుపు పథకాలు, విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సంతాన సిద్ధికి అనుకూలం.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. గృహ నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు కొత్త వ్యూహాలు అను సరించి విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం మార్పు విషయంలో సంకల్పం నెరవేరుతుంది.

సింహం: రుణాలు, పెట్టుబడులు, షేర్‌ మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: స్పక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధి స్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బృంద కార్యక్రమాలు, వేడుకల కోసం ఖర్చు చేస్తారు.

తుల: పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, యోగ, ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపు తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి.

వృశ్చికం: ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ప్రియతములకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. గత అనుభవంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు.

ధనుస్సు: బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

మకరం: సోదరీ, సోదరుల విషయాల్లో శుభ పరిణా మాలు సంభవం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు, సమావేశాలకు అనుకూలం. వాహన యోగం ఉంది.

కుంభం: పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి. సమావేశాలు, బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రయాణాలు, వేడుకలకు అవసరమైన నిధులు సమకూరతాయి.

మీనం: మూచ్యువల్‌ ఫండ్స్‌, పన్నులు, బీమా, గ్రాట్యుటీ, పింఛన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. రుణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గత అనుభవంతో లక్ష్య సాధనకు ప్రయత్నిస్తారు. పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

   ఎంత వ్యవధిలో పరీక్ష చేయించుకోవాలి?

  • 28వారాల వరకు - నెలకొకసారి
  • 28-36 వారాలు - 15 రోజులకొకసారి
  • 36 వారాల నుండి ప్రసవమయేవరకు - వారానికొకసారి
  • భారతదేశంలో ఎక్కువమంది తల్లులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారు. ఒకరోజు ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడమంటే దాని అర్థం ఒకరోజు ఆదాయాన్ని కోల్పోవడమే. ఈ కారణాలవల్ల తరచుగా పరీక్షకు వెళ్ళలేనివారు కనీసం 4 సార్లు పరీక్ష చేయిం చుకోవాలి.
  • గర్బం అని అనుమానం రాగానే • 24-26 వారాల మధ్య • 32-34 వారాల మధ్య • నెలలు నిండాక
©2019 APWebNews.com. All Rights Reserved.