ఫెయిల్యూర్ దొంగతనం..

ఫెయిల్యూర్ దొంగతనం..

షాంఘై : చైనాలోని షాంఘై పట్టణంలో హాలీవుడ్ మూవీ ‘హోమ్ ఎలోన్‌’ను గుర్తుకు తెచ్చే ఓ సీన్ జరిగింది. ఓ దొంగ చోరీ చేసే ప్రయత్నంలో తన పార్ట్‌నర్ (మరో దొంగ)తలపై కొట్టిన ఘటన షాంఘైలో జరిగింది. ఇద్దరు దొంగలు షాంఘైలో అర్థరాత్రి పూట చోరీ చేసేందుకు బయలుదేరారు. దొంగలిద్దరూ వైట్ కలర్ డ్రెస్, మాస్క్ వేసుకుని మెయిన్‌రోడ్డు పక్కనే ఉన్న ఓ షోరూం దగ్గరకు వచ్చారు.

వీరిలో ఓ దొంగ షోరూం గ్లాస్ డోర్ ను పగలగొడుతుండగా..మరో దొంగ డోర్ ను బ్రేక్ చేసేందుకు ఇటుకను విసిరాడు. అయితే అది డోర్ కు తగలకుండా తన పార్ట్‌నర్ తలకు గట్టిగా తాకింది. ఆ దెబ్బకు వెంటనే పార్ట్‌నర్ కుప్పకూలిపోయాడు. స్పృహ తప్పిన అతన్ని పక్కకు మోసుకెళ్లాడు. మొత్తానికి ఇద్దరు దొంగలు చోరీ చేసేందుకు వస్తే..అది కాస్త ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ దొంగతనం వీడియో పుటేజీని షాంఘై పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో ఒక్క రోజులోనే 12 మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరీ.

©2019 APWebNews.com. All Rights Reserved.