ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ చిన్నారి బతికేవాడు కాదు..

ఒక్క నిమిషం వాల్యూ ఎంత అని అడిగితే.. దానికి వాల్యూ ఏంది అంటారా? కాని.. ఒక్క నిమిషం తేడాలో చావును తప్పించుకున్న వాళ్లను అడిగితే మాత్రం ఖచ్చితంగా దాని విలువ చెప్తారు. రెండున్నర ఏండ్ల చిన్నారి కూడా ఒక్క నిమిషం తేడాలో చావును తప్పించుకున్నాడు. ఈ ఘటన ఇటలీలోని మిలాన్‌లో ఉన్న మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకున్నది. 


స్టేషన్‌లో తన అమ్మ పక్కన కూర్చున చిన్నారి.. అమ్మను వదిలి ముందుకు వచ్చి ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. ఇంతలో అతడి చెప్పులు స్లిప్ అవడంతో మెట్రో ట్రాక్‌పై పడ్డాడు. దీంతో కంగారు పడ్డ తల్లి సహాయం కోసం అటూ ఇటూ తిరిగింది. ఇంతలో ట్రాక్‌పై పడిపోయిన బాలుడిని గమనించిన ఇతర ప్రయాణికులు అక్కడ గుమికూడారు. ఆ ట్రాక్‌పై ట్రెయిన్ రావడానికి ఇంకో నిమిషం మాత్రమే ఉంది. ఇంతలో ఓ 18 ఏండ్ల కుర్రాడు వాళ్లందరినీ నెట్టుకుంటూ వెళ్లి ట్రాక్‌పై దూకాడు. వెంటనే పిల్లాడిని పైకి చేర్చి.. పిల్లాడి బొమ్మను కూడా తీసి ఇచ్చి వెంటనే పైకి ఎక్కేశాడు. అంతే... ఎంతో దైర్యం ప్రదర్శించి పిల్లాడిని కాపాడిన కుర్రాడిని అక్కడి వారంతా పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో కథ సుఖాంతమైంది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలయింది.

©2019 APWebNews.com. All Rights Reserved.