బతికున్న నత్తగుల్లనే వడ్డించారు..

సుషి.. జపాన్‌లో ఫేమస్ డిష్. మన దగ్గర బిర్యాని ఎలాగో జపాన్‌లో సుషి డిష్ అలాగ అన్నమాట. జపనీస్ రెస్టారెంట్లలో ఆ డిష్‌ను లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. దీన్నే క్లామ్ సుషి లేదా హొక్కిగాయ్ అని కూడా పిలుస్తారట. సముద్రంలో దొరికే నత్తగుల్లతో చేసే వంటకమే ఈ క్లామ్ సుషి. అయితే.. జపాన్‌లోని ఓ రెస్టారెంట్ బతికున్న నత్తగుల్లనే కస్టమర్‌కు వడ్డించారట. డిన్నర్‌లో ఏంచక్కా క్లామ్ సుషి తిందామని వచ్చిన కస్టమర్ ప్లేట్‌లో బతికున్న నత్తగుల్లను చూసి షాక్ అయ్యాడట. 

అయితే... ఫ్రెష్ ఫుడ్ తినడానికి జపనీస్ ఎంతో ఇష్టపడతారట. అందుకోసమే కొత్తగా ఆలోచించి.. ఇలా బతికున్న నత్తగుల్లతో చేసిన వంటకాన్ని అక్కడ వడ్డిస్తున్నారట. దీంతో... జపనీయులు ఆ బతికున్న నత్తగుల్లనే లొట్టలేసుకుంటూ నోట్లో వేసుకుంటున్నారట. ఇక.. ఆ కస్టమర్ బతికున్న నత్తగుల్ల డిష్‌ను లాగించడానికి ముందు దాని వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది. 

©2019 APWebNews.com. All Rights Reserved.