నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు..!

న్యూదిల్లీలోని నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ, మెడిక‌ల్ ఆఫీస‌ర్, మెడిక‌ల్ స్పెష‌లిస్ట్, అసోసియేట్ (అకౌంట్స్) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టుల ఆధారంగా అర్హతలు, వయోపరిమితి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 25 నుంచి మే 16 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. రాత ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
ఉద్యోగ వివరాలు...

పోస్టులు పోస్టుల సంఖ్య అర్హత, ఇతర వివరాలు
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) 47 సీఏ లేదా ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎంఏ.
అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ (ఏసీటీ) 20 ఎంఎస్సీ (కెమిస్ట్రీ).
మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఈ2) 35 ఎంబీబీఎస్‌. 
2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
మెడిక‌ల్ స్పెష‌లిస్ట్ (మెడిసిన్) 15 ఎంబీబీఎస్‌. 
ఏడాది అనుభవం ఉండాలి.
అసోసియేట్ (అకౌంట్స్) 47 సీఏ లేదా ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎంఏ.
మొత్తం పోస్టుల సంఖ్య‌ 164  
ద‌ర‌ఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా  
ఎంపిక విధానం రాత ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్, 
ఇంట‌ర్వ్యూ ద్వారా
 
చివ‌రితేది 16.05.2018
©2019 APWebNews.com. All Rights Reserved.