బ్యాంక్ ఆఫ్ బరోడాలో 424 ఉద్యోగాలు..!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 424 ఉద్యోగాలు..!
ముంబ‌యిలోని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కాంట్రాక్ట్ పద్ధతిన వెల్త్‌మేనేజ్‌మెంట్ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పని అనుభవం ఉండాలి. ఎంబీఏ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.100 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పోస్టుల ఆధారంగా వయోపరిమితిని నిర్ణయించారు. మే 6లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ వివరాలు...
 

పోస్టులు పోస్టుల సంఖ్య 
సీనియ‌ర్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్ 375
టెరిట‌రీ హెడ్‌ 37
గ్రూప్ హెడ్‌ 06
ఆప‌రేష‌న్స్ హెడ్ (వెల్త్‌) 01
ఆప‌రేష‌న్స్ మేనేజ‌ర్‌ ( వెల్త్‌) 01
స‌ర్వీసెస్ & కంట్రోల్ మేనేజ‌ర్ 01
ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్ (ఇన్వెస్ట్‌మెంట్స్) 01
కంప్ల‌యిన్స్ మేనేజ‌ర్ (వెల్త్‌) 01
ఎన్ఆర్ఐ వెల్త్ ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్ 01
మొత్తం పోస్టులు 424
చివరితేది: మే 6.
©2019 APWebNews.com. All Rights Reserved.