ఏపీ పోలీసుశాఖలో 2,485 ఉద్యోగాలు..!

 

 

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 2,485 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండి 18 - 30 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఉద్యోగ వివరాలు....
* డ్రైవర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 2,485
అర్హత: పదోతరగతి లేదా ఇంటర్.
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఈటీ), రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: వెల్లడించలేదు.
చివరితేది: వెల్లడించలేదు.
గమనిక: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తివివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడవచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.