జట్టు కట్టి గిట్టుబాటు పట్టి

జట్టు కట్టి గిట్టుబాటు పట్టి 
కూరగాయల ఉత్పత్తి  దారుల కంపెనీ ఏర్పాటు 
దళారీ వ్యవస్థకు స్వస్తి..అభివృద్ధి వైపు దృష్టి 
ఆదర్శం.. ద్వారకాతిరుమల మండల రైతులు 
ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే 

దళారుల చేతుల్లో మగ్గిపోతున్న రైతులు దాని నుంచి బయటపడాలని భావించారు. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించుకోవాలనే ఆలోచనకు ఆచరణను జోడించారు. కూరగాయల ఉత్పత్తిదారుల కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం సేకరణ కేంద్రం ఏర్పాటు చేసుకుని వ్యాపారులను తమ వద్దకే రప్పించుకొంటున్నారు. 
ఆరుగాలం కష్టపడినా కనీసం పెట్టుబడులూ రాని మెట్ట పంటలకు బదులు కూరగాయల సాగు వైపు రైతులు మొగ్గు చూపారు. నీటి సదుపాయం ఉంటే ఏడాది పొడవునా సిరులు కురిపించే కూరగాయల సాగును కొన్నేళ్లుగా ద్వారకాతిరుమల మండలంలో చేపడుతున్నారు. అయితే ఉత్పత్తులను విక్రయించుకునేందుకు దళారులను ఆశ్రయిస్తూ నష్టాలను చవిచూస్తున్నారు. ఈనేపథ్యంలో దళారీ వ్యవస్థ నుంచి బయటపడే విధంగా రైతులంతా కలిసి సంఘంగా ఏర్పడ్డారు. కూరగాయలను వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కలెక్టర్‌ భాస్కర్‌ చేయూతనివ్వడంతో రైతులు ప్రగతి దిశగా పయనిస్తున్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.