అమ్మభాషపై మమకారం. అభివృద్ధికి శ్రీకారం..!

అమ్మభాషపై మమకారం. అభివృద్ధికి శ్రీకారం..! 
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్న లక్కవరం పండితులు 
సులభశైలి బోధనతో భాషకు మరింత చేరువ 
జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే 

నేటి ఆధునిక కాలంలో మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యువత మాతృ భాషపై పట్టు కోల్పోతుంది. కానీ మాతృభాషపై ఉన్న మమకారంతో తెలుగును సరళమైన బోధన విధానాలతో నేటి తరానికి అందిస్తున్నారు ఈ పండితులు. లక్కవరం గ్రామానికి చెందిన పలువురు తెలుగు పండిత విద్యను అభ్యసించి  ఉపాధ్యాయులుగా పనిచేస్తూ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తున్నారు.. పాఠశాలలో విద్యార్థులకు మాతృభాషపై అభిమానం పెంచేలా చక్కటి బోధన పద్ధతులను పాటిస్తున్నారు. దీనికి అనుగుణంగా విద్యార్థుల బోధనకు కావాల్సిన పుస్తకాలను సొంతంగా రాస్తూ భాష పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక్క లక్కవరం గ్రామంలో ఈ తరహా తెలుగు పండితులు సుమారు 29 ఉన్నారు. వీరంతా వివిధ ప్రదేశాలలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాగే ఏటా విజయవాడ నగరంలో జరిగే పుస్తక ప్రదర్శన మహోత్సవంలో పాల్గొనడంతో పాటు ఎందరో మహనీయులు రచించిన పుస్తకాలను చదివి వాటి సారాంశాన్ని విద్యార్థులకు అందిస్తూ భాషపై తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పండితులు ‘న్యూస్‌టుడే’తో తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. 
కొత్తదనాన్ని

నింపుకునే జీవ నది 
స్వచ్ఛమైన తెలుగు భాష ఎప్పుడూ కొత్తదనాన్ని నింపుకొంటూ జలజలా ప్రవహించే జీవ నది లాంటిది. ఏ భాషనైనా తనలో ఇముడ్చుకుంటూ ప్రేమామృతాన్ని పంచి ఇవ్వగల గొప్ప శక్తి తెలుగు భాషకే సాధ్యమవుతుంది. పద్యం అనేది ఒక్క తెలుగు భాషలోనే ఇమిడి ఉంది. ఎందరో మహనీయులు తమ రచనల ద్వారా తెలుగు భాషలో అద్భుతమైన కావ్య ప్రపంచాన్ని అందించారు. అటువంటి  మాతృ భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత  ప్రభుత్వాలు, ప్రజల పైన ఉంది.  అప్పుడే భావి తరాలకు మన భాష సంస్కృతి, సంప్రదాయాలను అందించగలుగుతాం.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.