సోమేశ్వరునికి విశేష పూజలు ...!

ఎపి వెబ్ న్యూస్.కామ్

పంచారామక్షేత్రమైన గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకుని స్వామివారు గోధుమవర్ణంలో మంగళవారం భక్తులు దర్శనమిచ్చారు.

ఉదయం స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకాలు, సహస్ర నామ పూజలు జరిగాయి. మధ్యాహ్నం సోమేశ్వరునికి పుష్పాలంకరణ, పార్వతీ అమ్మవారికి పుష్పాలంకరణ, సహస్ర కుంకుమ పూజలు, జనార్దనస్వామి, లక్ష్మిదేవికి మల్లె పువ్వులతో విశేషాలంకరణ, పూజలు ప్రధానార్చకులు సోంబాబు, రామకృష్ణ, సత్యనారాయణశర్మ వేదమంత్రాలతో పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వేగేశ్న రంగరాజు, సభ్యులు, ఈవో కె.కేశవకుమార్‌, సిబ్బంది రామకృష్ణ, ప్రసాద్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.