గ్రామీణ తపాలా బీమా పథకంపై అవగాహన

గ్రామీణ తపాలా బీమా పథకంపై అవగాహన

బలిజిపేట: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన గ్రామీణ తపాలా బీమా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం డివిజన్‌ తపాలా శాఖ డివిజన్‌ పర్యవేక్షకుడు జె.ప్రసాద్‌ బాబు కోరారు. బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని తపాలా శాఖ ఉద్యోగులంతా బుధవారం బలిజిపేట పురవీధుల్లో గ్రామీణ తపాలా జీవిత బీమాపై ప్రదర్శనగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ బీమా పథకం గ్రామీణులకు వరంగా మారే అవకాశం ఉందని.. ఉద్యోగులంతా ప్లకార్డులు చేపట్టి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బొబ్బిలి డివిజన్‌ తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శేషారావు, 34 తపాలా శాఖల పరిధిలోని ఉద్యోగులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.