కళ్లకు గంతలు కుట్టుకుని మోటారుసైకిల్‌ ర్యాలీ ..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

ప్రత్యేక హోదా కోరుతూ ఇంద్రజాలికుడు, అవార్డులు, రికార్డుల సాధకుల సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు శ్యామ్‌ జాదూగర్‌, ఆయన తనయుడు మోహిత్‌ కళ్లకు గంతలు కట్టుకుని చీపురుపల్లిలోని మోటారు సైకిల్‌ ర్యాలీ చేశారు.

మంగళవారం చీపురుపల్లి వచ్చిన సందర్భంగా వారు కళ్లను మూసివేసి గోధుమ నూక వేసి గంతలు కట్టుకున్నారు. శ్రీకాకుళం రహదారిలో  మోటారు సైకిళ్లను నడుపుతూ విజయనగరం-పాలకొండ రహదారిలోని సీటీ కేబుల్‌ వరకు వెళ్లారు. అక్కడ నుంచి గాంధీ కూడలి వరకు ర్యాలీ చేశారు. అబ్బురపరిచే విధంగా ఎక్కడా తడబాటు పడకుండా ఏకాగ్రతతో వాహనాలను నడపడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. రహదారిపై వాహనాల రద్దీ ఉన్నప్పటికీ ధైర్యంగా ద్విచక్ర వాహనాలను నడిపారు. పెద్దసంఖ్యలో స్థానిక యువత వారిని అనుసరించారు. ఈ ర్యాలీని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశయ సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ, వార్డు సభ్యుడు గవిడి సురేష్‌ పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.