ఎపి వెబ్ న్యూస్.కామ్

ప్రత్యేక హోదా కోరుతూ ఇంద్రజాలికుడు, అవార్డులు, రికార్డుల సాధకుల సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు శ్యామ్‌ జాదూగర్‌, ఆయన తనయుడు మోహిత్‌ కళ్లకు గంతలు కట్టుకుని చీపురుపల్లిలోని మోటారు సైకిల్‌ ర్యాలీ చేశారు.

38,808 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

బలిజిపేట: మండలంలోని 2,824 మంది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో 38,808 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని వెలుగు ఏపీఎం సత్యనారాయణ తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన పది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లను చేపట్టి రైతులకురూ.60.15 కోట్లు అందజేశామన్నారు. మండలంలోని అజ్జాడ, పలగర, బలిజిపేట, గలావల్లి, నారాయణపురం, పెదటెంకి, పెద్దింపేట, సుభద్ర,వంతరాం, వెంగళరాయపురం గ్రామాల్లోని రైతుల నుంచి కొనుగోళ్లు చేపట్టి.. 90శాతం వరకు బిల్లులు చెల్లించామన్నారు. వెలుగు గ్రామైక్య సంఘాల ద్వారా, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని ఆయన తెలిపారు.

గ్రామీణ తపాలా బీమా పథకంపై అవగాహన

బలిజిపేట: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన గ్రామీణ తపాలా బీమా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం డివిజన్‌ తపాలా శాఖ డివిజన్‌ పర్యవేక్షకుడు జె.ప్రసాద్‌ బాబు కోరారు. బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని తపాలా శాఖ ఉద్యోగులంతా బుధవారం బలిజిపేట పురవీధుల్లో గ్రామీణ తపాలా జీవిత బీమాపై ప్రదర్శనగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ బీమా పథకం గ్రామీణులకు వరంగా మారే అవకాశం ఉందని.. ఉద్యోగులంతా ప్లకార్డులు చేపట్టి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బొబ్బిలి డివిజన్‌ తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శేషారావు, 34 తపాలా శాఖల పరిధిలోని ఉద్యోగులు పాల్గొన్నారు.

Page 1 of 2

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.