ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:-కె.రాము
జనసేన పార్టీ చీరాల నియోజకర్గ కార్యాలయం లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో చీరాల నియోజకవర్గ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ గారు 10/ 2/ 2019 ఆదివారం జనసేన పార్టీ చీరాల నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు వివరాలు తెలియజేశారు.
చీరాల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, మొదట ప్రసాద్ థియేటర్ దగ్గర నుండి సాయంత్రం నాలుగు గంటలకు ర్యాలీ కవాతు ప్రారంభమవుతుందని, అక్కడినుండి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసిప్రగడ కోటయ్య గారి విగ్రహం దగ్గర సాయంత్రం 5 గంటలకు జండా ఆవిష్కరణ మరియు బహిరంగ సభ జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు గౌరవనీయులు పసుపులేటి హరిప్రసాద్ గారు మరియు రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు గారు, మరియు జిల్లా నాయకులు విచ్చేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేనిఫెస్టో జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం గురించి ప్రసంగించనున్నారు.కావున వేలాదిగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా మనవి చేశారు.ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్ , గొల్లపూడి శ్రీనివాసరావు ,రామిశెట్టి శివరామకృష్ణ , సాంబశివరావు ,మురళి , వాసు, యేరిచర్ల అశోక్ కుమార్, రత్న కుమారి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.