ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పూర్తి ..!

ఎపి వెబ్ న్యూస్ .కామ్ 

కందుకూరు గ్రామీణం- న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు.

ఈ మేరకు వలేటివారిపాలెం మండలంలోని పోకూరు, బడేవారిపాలెం, నూకవరం గ్రామాల్లో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంయుక్త కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ సత్యఏసుబాబు, ఎమ్మెల్యే పోతుల రామారావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దివి శివరామ్‌లు పర్యటన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ప్రజలతో ముఖాముఖి, అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు చెందిన శిలాఫలకాలు, ప్రస్తుతం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. సీఎం భద్రతా చర్యల్లో భాగంగా హెలీప్యాడ్‌, ఆయకట్టు రైతులతో చర్చించేందుకు తగిన వసతులను పరిశీలించి సూచనలు చేేశారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించే సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. పోకూరు చెరువులో హెలీప్యాడ్‌, తాగునీటి చెరువును భద్రతాధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. ఆ ప్రాంతం అంతటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్‌ స్క్వాడ్‌ అధికారులు హెలీప్యాడ్‌, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సభా వేదిక, శిలాఫలకాలను తనిఖీ చేశారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.