ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- రాజేష్
🔸వెంకటాచలం మండలం కసుమూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటన..
🔸ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు, ఆడపడుచులకు పసుపు-కుంకుమ కానుక చెక్కుల పంపిణీ.
మంత్రి సోమిరెడ్డి కామెంట్స్
🔸రూ.200గా ఉన్న పింఛన్ ను రూ.వెయ్యికి ఇప్పుడు రూ.2 వేలకు పెంచి అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడిదే..
🔸రత్నాలను కాపీ కొడుతున్నామంటున్నారు..మీ రత్నాలు లోటస్ పాండ్లో ఉంటే..మా రత్నాలు ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నాయి..
🔸పేదల ఆదాయం పెంచేందుకు ఎవరూ ఊహించని స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేస్తున్నారు..
🔸ఇళ్లకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచాం..
🔸1999లో ఒప్పందం మేరకు కండలేరు నుంచి చెన్నైకు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తుంటే నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే, చిత్తూరుకు నీటిని తరలించే ఫైలుపై మంత్రిగా కళ్లు మూసుకుని సంతకం పెట్టారు..
🔸ఇలాంటి రాజకీయ క్రీడలు మాకు తెలియవు..జనం కోసం పనిచేయడమే తెలుసు..