ఎపి వెబ్ న్యూస్.కామ్
రిపోర్టర్:- కె. రాము
ఉదయగిరి నియోజక వర్గం ఇది నెల్లూరు జిల్లాకి దాదాపు 100 కిలో మీటర్ల దూరం లో ఉంటుంది ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కావటంతో ఇక్కడ గుక్కెడు నీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు.
ప్రజలు కి నీరు లేక ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలు వలసలు వెల్లుతున్నారంటే ఇక్కడ మంచి నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది.ఈ ప్రాంతంలో మంచి నీటి కష్టాలను గుర్తించి ప్రజలు దాహం తీర్చేందుకు త్రాగునీటి కష్టాలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తాను ఉన్నా నంటూ ముందుకు వచ్చారు కావ్యాక్రిష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.వారి ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఉదయగిరి లో పలు మండలాలు అయిన వింజమురు,ఉదయగిరి లో ట్రస్ట్ ద్వారా మంచినీటి ట్యాంకర్లు ద్వారా ప్రజల దాహం తీరుస్తూన్నారు .వారి నిస్వార్థ సేవకు వారి చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.