రుద్రకోట రైస్‌మిల్లులో రేషన్‌ బియ్యం స్వాధీనం ..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన కావలి మండలంలోని రుద్రకోటలో శ్రీశ్రీబాలజీరైస్‌ మిల్లులో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

విజిలెన్స్‌ డీఎస్పీ పి.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పౌరసరఫరాల శాఖ ఏఎస్‌వో పుల్లయ్య, రెవెన్యూ ఆర్‌ఐ, వీఆర్వో సమక్షంలో మిల్లులో పరిశీలించగా కిలో రూపాయి రేషన్‌ బియ్యం 132 బస్తాలు గుర్తించారు. వీటిల్లో 52 బస్తాలు నేరుగా పౌరసరఫరాల గోతాల్లో (50) కిలోల బస్తాలు ఉన్నాయి. వీటికున్న ట్యాగ్‌లను పరిశీలించగా ప్రకాశం జిల్లాలోని వివిద ప్రాంతాలకు చెందినవిగా ఉన్నాయి. మిగిలినవి తెల్ల ప్లాస్టిక్‌ బస్తాల్లో 80 బస్తాలు రేషన్‌ బియ్యం ఉన్నాయి. ఈ బియ్యం మొత్తం 66 క్వింటాళ్లుగా లెక్కతేల్చారు. అలాగే ఈ మిల్లు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం మిల్లింగ్‌ చేసి సీఎంఆర్‌ బియ్యం ప్రభుత్వానికి అందిస్తోంది. ఈవిధంగా పరిశీలించగా ధాన్యం మిల్లింగ్‌ చేసిన బియ్యం శ్రీశ్రీబాలాజీ పేరుతో ముద్రించిన గోతాల్లో 25 బస్తాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం మిల్లు ఆవరణలో ఉండగా వీటిని లెక్కించగా మొత్తం 262 మెట్రిక్‌ టన్నులు ఉన్నట్లు లెక్కతేల్చారు. మొత్తం స్వాధీనం చేసుకుని పౌరసరఫరాల శాఖకు అప్పగించినట్లు విజిలెన్స్‌ డీఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.

 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.