చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం...!

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు కృష్ణానగర్‌ రైల్వే ట్రాక్‌ బిర్లాగేట్‌ వద్దనున్న లక్ష్మి కల్యాణ మండపంలో కర్నూలు నియోజకవర్గ మినీ మహానాడు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ హాజరై తెదేపా జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సోమిశెట్టి మాట్లాడారు. విభేదాలు వీడి అందరూ కలసికట్టుగా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు మినీ మహానాడు జరుగుతాయని, ఇక్కడ తీర్మానించిన అంశాలను ఈనెల 22న జరగనున్న జిల్లా మహానాడులో ప్రవేశపెట్టాలన్నారు. జిల్లాలో తీర్మానించిన అంశాలను ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న రాష్ట్ర మహానాడులో ప్రవేశపెడుతామన్నారు. వార్డులకు ఇన్‌ఛార్జులను నియమించామని, వారు ఆయా వార్డుల్లో పార్టీ కోసం పనిచేయడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. లేకుంటే తొలగిస్తామన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.