కదిలొచ్చిన జలం... పులకించిన జనం ..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రాచర్ల, కంభం, గిద్దలూరు పట్టణం, బేస్తవారపేట, న్యూస్‌టుడే : వర్షాకాలం, శీతాకాలాల్లోనే తాగునీటి ఎద్దడితో కొట్టుమిట్టాడిన పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు ప్రాంతంలో ఒక్కసారిగా మంగళవారం జలకళ కనిపించడం నయనానందం చేస్తోంది.

ఇటీవల రెండుమూడు సార్లు వానలు పడినా ఓ మాదిరిగా నీరు కనిపించింది. వెంటనే ఇంకిపోయింది. రాచర్ల, కంభం మండలాల ఎగువ ప్రాంతాల్లోని నల్లమల అడవుల్లో కురిసిన వర్షానికి  గుండ్లకమ్మ నది, లోతువాగు పొంగి ప్రవహించాయి.  రాచర్ల మండలంలో  39 మి.మీ. నమోదు కాగా  గుండ్ల బ్రహ్మేశ్వర జలాశయం సిమెంట్‌ కాంక్రీట్‌ వరకు నీరు చేరింది కిందకు జాలువారింది. కంభం చెరువు వైపుగా ప్రవాహం సాగింది.  లోతువాగుకు పెద్ద ఎత్తున నీరు చేరింది. జేపీచెరువు, అక్కపల్లి, జేపీచెరువు రంగానయకస్వామి ఆలయ  రహదార్లపై నీరు ప్రహించింది.  నక్కల వాగు, ఎర్రవాగు పొంగి ప్రహించాయి. గుడిమెట్ట, అనుములపల్లి చెరువులకు కొంత మేర నీరు చేరింది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.