నిర్లక్ష్యం ఖరీదు రూ.4కోట్లు! బద్వేలు ప్రభుత్వాసుపత్రి భవనాల నిర్మాణంలో ఇష్టారాజ్యం

నిర్లక్ష్యం ఖరీదు రూ.4కోట్లు! 
బద్వేలు ప్రభుత్వాసుపత్రి భవనాల నిర్మాణంలో ఇష్టారాజ్యం 
నిర్ణీత గడువులోపు పూర్తిచేయడంలో 
గుత్తేదార్ల  వైఫల్యం 
   పునాది గోతుల్లోనే రూ.2.09 కోట్లు.. కట్టడంలోనూ 
నాసిరకం  పెచ్చుమీరిన 
రాజకీయం.. పేదలకు అందని ప్రజావైద్యం 

ఈనాడు, కడప - న్యూస్‌టుడే, బద్వేలు : అభివృద్ధి అంకెలకే పరిమితమైంది.. ప్రగతి పునాదుల్లోనే మిగిలింది.. పేదల దవాఖానా పరిపుష్టం చేయాలనే లక్ష్యం చతికిలబడగా, ఉన్నతాశయంతో చేపట్టిన పనులకు కాలగ్రహణం పట్టింది. చేసిన పనుల్లోనూ నాణ్యతాలోపం కనపడుతోంది.  బద్వేలు ప్రభుత్వాసుపత్రి భవనాల నిర్మాణంలో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా సరిహద్దులో ఉండే బద్వేలు ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువ. ఇక్కడికి బద్వేలు, కలసపాడు, పోరుమామిళ్ల, కాశినాయన తదితర ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం, ఆత్మకూరు, మర్రిపాడు తదితర ప్రాంతాల నుంచీ చికిత్స కోసం వస్తుంటారు. నిత్యం 300 మంది వరకు ఓపీ సేవలు పొందుతుంటారు.ప్రస్తుతం ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోవడంతో అత్యవసర కేసులకూ ఈ వైద్యాలయమే దిక్కవుతోంది. కీలకంగా గుర్తించి ఈ ప్రభుత్వ వైద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం పూనుకొంది. 
మూడు దశాబ్దాల కిందట కేవలం 18 పడకలతో ఉన్న బద్వేలు ప్రభుత్వాసుపత్రి స్థానిక కోటవీధిలోని బ్రిటీషు కాలంనాటి పాతభవనాల్లో నిర్వహించేవారు. క్రమేణా అవి దుస్థితికి చేరడంతో సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 18 నుంచి 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పాతభవనాల్లో వెసులుబాటు లేకపోవడంతో తాత్కాలికంగా సీమాంక్‌ భవనంలోకి ఆసుపత్రిని మార్చారు. అక్కడే కొంతకాలంగా రోగులకు సేవలందిస్తున్నారు. ఆ భవనంలో వసతులు లేకపోవడంతో ప్రభుత్వ హయాంలో ఆసుపత్రికి భవనాలు సమకూర్చేందుకు పూనుకొన్నారు. 2015లో రూ.2.09 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు (ఏపీఎంఐడీసీ) నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. సీమాంక్‌ భవనం పైభాగంలో గదుల నిర్మాణానికి సన్నద్ధమై టెండర్లు పిలిచారు. ముందు పునాదులకు గోతులు కూడా తవ్వారు.   ఆ పనులు అక్కడితో ఆగిపోయాయి. పైభాగంలో గదుల నిర్మాణానికి గాను సీమాంక్‌ భవనం పైకప్పు కొంత తొలగించగా.. క్రమేణా అది సమస్యగా మారింది. వర్షం వస్తే ఉరుపుతో రోగులు ఇబ్బంది పడేవారు. ఎంతకూ కొత్త గదుల నిర్మాణం ఊపందుకోకపోవడంతో చేసేది లేక అధికారులు తాత్కాలికంగా పైకప్పు సరిచేసుకున్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.