సమన్వయంతో పనిచేయాలి రాములోరి కల్యాణం రోజు వాహనాల మళ్లింపు

సమన్వయంతో పనిచేయాలి 
రాములోరి కల్యాణం రోజు వాహనాల మళ్లింపు 

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఏకశిలానగరిలోని కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలను వచ్చే నెలలో వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం, తితిదే సంకల్పించింది. ఉత్సవాలను విజయవంతం చేయడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలి. అందరూ సమన్వయంతో పనిచేస్తే రాములోరి ఉత్సవాలను విజయవంతం చేయవచ్చునని.. జిల్లా కలెక్టరు టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. మార్చి 30న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఆరోజు వాహనాల రద్దీ నియంత్రణ, మళ్లింపుపై ఏం చేయాలని కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ దృష్టిసారించారు. సిద్దవటం మండలం సాయినగర్‌ సాయిబాబా ఆలయంలో శనివారం వారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన రేఖా చిత్ర పటాన్ని పరిశీలించారు. కడప-రేణిగుంట జాతీయ రహదారి-716 నుంచి 18 కి.మీ మేర వాహనాలను దారి మళ్లిస్తే క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలుసుకునేందుకు పరిశీలన చేశారు.  ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో మరోసారి పోలీసు, రాబడి, ర.భ.శాఖ అధికారులు ఉమ్మడిగా పరిశీలన చేయాలని ఆదేశించారు. ఏయే పనులు చేసేందుకు ఎంత మొత్తం నిధులు కావాలో ప్రతిపాదనలు పంపితే వెంటనే అనుమతి ఇస్తామని చెప్పారు.వచ్చేనెల 10వ తేదీలోపు  కార్యక్రమంలో శిక్షణ ఎస్పీ వకుల్‌ జిందాల్‌, డీఈవో శైలజ, పీఆర్‌ ఎస్‌ఈ నరసింహారెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మం, ఈఈ కృష్ణారెడ్డి, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, రాజగోపాల్‌రెడ్డి, డిప్యూటీ ఈవో లక్ష్మణ్‌నాయక్‌, సీఐలు రవికుమార్‌, శ్రీరాములు, తహసీల్దారు శిరీష, ఎస్సైలు ధనుంజయుడు, అరుణ్‌రెడ్డి, ఏఈలు జనార్ధన్‌, గురివిరెడ్డి పాల్గొన్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.