నగరపాలక..సమస్యలు పట్టని ఏలిక అలంకారప్రాయంగా కడప కార్పొరేషన్‌

నగరపాలక..సమస్యలు పట్టని ఏలిక 
అలంకారప్రాయంగా కడప కార్పొరేషన్‌ 
పరిష్కారంపై దృష్టి పెట్టని అధికార వర్గం 
సమస్యలతో సహవాసం చేస్తున్న నగర జనం 

కడప.. 2005 నుంచి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణం వరకూ సమైక్యాంధ్రలో ఈ ప్రాంతాన్ని చూసి ఈర్శ్యపడని నాయకులు లేరు.. కడపకు నిధుల వరద పారిస్తున్నారని ఆడిపోసుకోని రోజు లేదు.. కడపలో జరిగే ప్రతి 
అభివృద్ధి పని వెనుక కోట్ల రూపాయల అవినీతి దాగుందని విపక్షం  విమర్శలు చేయని క్షణం లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా కడప ఎలా ఉందో కడపోళ్లకు తెలుసు!! 2014 పురపాలిక ఎన్నికల తర్వాతైనా కడప దశదిశ మారతుందని 
ఆశించిన ప్రజలకు చివరకు నిరాశే మిగిలింది. 
జిల్లా కేంద్రంలో వైకాపా నగరపాలక సంస్థను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కడప నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఇవ్వటం లేదని నగరపాలక సంస్థ పాలకవర్గం 
నాలుగేళ్లుగా చెబుతూ వస్తోంది. నగరపాలక మొత్తం వారి చేతుల్లోనే ఉంది.. 
అవినీతికి కారణం వారే అంటూ అధికార పార్టీ నాయకులు గత ఐదేళ్లుగా చేసిన విమర్శలనే చేస్తూ కాలం గడుపుతున్నారు. వారిని వీరు.. వీరిని వారు విమర్శించుకుంటున్న నేపథ్యంలో కడప నగరాభివృద్ధికి సంబంధించిన కీలక సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవటం గమనార్హం’ 
కడప సంక్షేమం, న్యూస్‌టుడే: కడప నగర జనాభా నాలుగు లక్షలు దాటుతున్న నేపథ్యంలో మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా, రహదారుల నిర్మాణం - నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ తీవ్ర సమస్యగా పరిణమించింది. నాలుగేళ్లలో ఈ సమస్య పరిష్కారానికి ఇటు పాలకవర్గంగానీ అటు అధికార పార్టీగానీ చేసింది శూన్యం. నగరాభివృద్ధికి కొత్తగా ఎలాంటి పథకాలను అమలు చేయకపోవటం ఒక వైఫల్యం కాగా గతంలో మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్క దాన్ని కూడా పూర్తి చేయలేకపోవటం మరో ఘోర వైఫల్యం.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.