వీడియో చిత్రీకరణపై శిక్షణ

వీడియో చిత్రీకరణపై శిక్షణ

యోవేవి (కడప), న్యూస్‌టుడే: యోగి వేమన విశ్వవిద్యాలయంలోని పాత్రికేయ విభాగ విద్యార్థులకు వీడియోగ్రఫీలో ప్రత్యేక శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగ శిక్షకుడు సుభాన్‌ బాషా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పత్రికా రంగంలో వాడుకలో ఉన్న పలు కెమెరాలు, వాటిని ఉపయోగించే విధానం, ఫోటోలు తీయడంపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో వీడియోగ్రఫీ ప్రాముఖ్యత, వీడియో కెమెరాను ఉపయోగించి విజువల్స్‌ తీయడం వంటివి ఆయన ప్రయోగాత్మకంగా విద్యార్థులకు తెలిపారు. అధ్యాపకురాలు డాక్టర్‌ యజ్ఞశ్రీ మణికర్ణిక కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో జర్నలిజం విభాగం సమన్వయకర్త డాక్టర్‌ టి.శ్యాంస్వరూప్‌, అధ్యాపకులు డాక్టర్‌ శ్రీనివాసులు, రామసుధ, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.