ప్రకృతి వ్యవసాయం లాభదాయకం ...!

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని వ్యవసాయ సహాయ సంచాలకులు సుబ్రమణ్యం పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని అంతయ్యగారిపల్లెలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును నిర్వహించారు.

తొలుత ప్రకృతి వ్యవసాయంపై అనంతయ్యగారిపల్లె గ్రామ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ప్రకృతి వ్యవసాయాన్ని పాటించిన ఐదుగురు రైతులు రాజశేఖర్‌రెడ్డి, రాజారెడ్డి, నరసారెడ్డి, శివయ్య, ప్రభాకర్‌ దుశ్శాలవాలతో ఘనంగా సత్కరించారు. ఆత్మవారి ఆర్థిక సహకారంతో 18 మంది రైతులకు పొలాల్లో పురుగుల నివారణ కోసం వినియోగించే పసుపు ప్లేట్లను పంపిణీ చేశారు. ఏడీ మాట్లాడుతూ.. ఒక ఆవుతో ఐదు ఎకరాలను సాగు చేసుకోవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయడంతో భూమి నిస్సారంగా మారే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో  పంట దిగుబడి ఎక్కువగా వస్తుందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు.  కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖాధికారిణి కృష్ణవేణి, సాంకేతిక ఏవో రమేష్‌, ఎంపీఈవో రోజా, సీఏ బుజ్జి, రైతులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.