ఎలక్షన్ మోడల్ కోడ్ అమలులో వుంది, గీత దాటితే కటిన చర్యలు తప్పవు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్ అన్బురాజన్ ఐ.పి.యస్..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు

ఈ రోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనెట్ హాల్ నందు సాదారణ ఎన్నికల నిమిత్తం అర్బన్ జిల్లా లోని పోలీస్ ఉన్నతాధికారులతో మరియు అబ్కారి శాఖ (Excise Dpt.), బ్యాంకు అధికారులు, వాణిజ్య పన్ను శాఖ, రావాన శాఖ, BSNL అధికారులతో తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్ అన్బురాజన్ ఐ.పి.యస్ గారు విస్త్రుత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినారు.

ఈ సందర్భంగా ముందుగా పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా లో సాదారణ ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ అమలులో ఉన్నందున రాబోయే 30 రోజులు కష్టపడి పని చేసి తిరుపతి అర్బన్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, 24/7 పోలీస్ అధికారులు అందుబాటులో వుండి, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని, జిల్లా లోని డి.యస్.పి స్థాయి అధికారులు పోలీస్ నోడల్ అధికారులుగా అసంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తారు. బూత్ లెవెల్ రూట్ అధికారులు తరువుగా తమకు కేటాయించిన నిర్దేశిత ప్రాంతాలలో ముందస్తు సమాచారం సేకరించి, తనికీలు చేయాలని, మద్యపాన అంగడ్లు, మరియు బెల్ట్ షాప్ పై నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు మరియు ఎన్నికలలో వివాదాలు సృష్టించేవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారంధరని ముందస్త చర్యలు నిమిత్తం సంబంధిత తహసిల్దారి వద్ద హాజరుపరిచి బైండ్ ఓవర్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి బూత్ స్థాయిలో పూర్తి సమాచారం రూట్ అధికారి సేకరించాలని, ఏదైనా లా&ఆ సమస్యలు ఎక్కడైనా వస్తే తమ తమ సరిహద్దులకు సంబంధం లేకుండా వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి సమస్యని పరిష్కరించాలని, ఈ విషయంలో ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. ప్రచార ర్యాలీలు, మరియు ఊరేగింపులకు తప్పని సరిగా రాజకీయ నాయకులు పరిమిషన్ తీసుకోవాలని, సాదారణ ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగరాదని, అలాగే తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో జరిగే సాదారణ ఎన్నికలకు తిరుపతి పోలీస్ సిబ్బంది సిధంగా ఉండారని, అదనపు భలగాలు కూడా త్వరలో నిర్ణిత సమయానికి చేరుకుంటాయని, ప్రజలు ఎలాంటి అపోహాలను నమ్మకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ప్రజల యొక్క భద్రతే మా విధిగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు సేవ చేయదానికి సిద్దంగా ఉన్నారని, ఎలక్షన్ మోడల్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా అధిక మొత్తంలో నగదుకాని, భంగారు ఆభరణాలు కాని, విలువైన వస్తువులు కాని, సరియైన రసీదులు లేకుండా తమవెంట తీసుకువేల్లరాదని ప్రజలు కూడా మీ మీ ప్రాంతాలలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు గాని, అనుమానిత వ్యక్తులుగాని సంచరించినా, పోలీస్ డయల్ 100 కు సమాచారం ఇవ్వవలసినదిగా కోరుచున్నామని, దీనికి ప్రజలు పూర్తిగా పోలీస్ వారికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసారు.
అలాగే యస్.పి గారు ఇతర శాఖ లను ఉద్దేశించి మాట్లాడుతూ బ్యాంకు అధికారులు తమ బ్యాంకు యందు ఒక లక్ష రుపాయులు కన్నా ఎక్కువ మోతాదులో విత్ డ్రావల్ చేస్తే పోలీస్ వారికి తెలియజేయాలని, అలాగే రవాణా శాఖ వారు భందోబస్తూ నిమిత్తం వచ్చు అధికారులకు మరియు సిబ్బందికి సరైన వాహనాలను సమకూర్చాలని, అబ్కారి శాఖ వారు అధిక మోతాదులో కొనుగోలు చేయు మద్యపాన అంగడ్లపై, మరియు బెల్ట్ షాప్ లు లేకుండా చేయాలని, అలాగే వాణిజ్య శాఖ వారు అధిక మోతాదులో విలువైన వస్తువులు కొనుగోలు చేసినవారిపై నిఘా ఉంచాలని, BSNL వారు ఈ పూర్తి ఎన్నికలు అయ్యేంతవరకు నెట్వర్క్ ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని, అలాగే పోలీస్ అధికారులు, మరియు ఇతర శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని యస్.పి గారు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా లోని అడిషనల్ యస్.పి లు, అడ్మిన్ శ్రీ రాజేశ్వర రెడ్డి గారు, లా&ఆ అనిల్ బాబు గారు, తిరుమల మహేశ్వర రాజు గారు, అబ్కారి సూపరింటెండెంట్ గారు, యస్.బి డి.యస్.పి సి.యం.గంగయ్య గారు, డి.సి.ఆర్.బి సి.ఐ వెంకటేశ్వర్లు గారు, మరియు జిల్లా లోని సి.ఐ లు, యస్.ఐ లు, బ్యాంకు అధికారులు, అబ్కార్ అధికారు పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.