ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టాప్ రిపోర్టర్:- వేణుగోపాల్
భయం గుప్పెట్లో ఆంద్రా రాజధాని అమరావతి..రక్షణ లేని జీవితాలు...గుంటూరు జిల్లా అమరావతి పరిధిలోని మంగళగిరిలో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది...
కృష్ణాతీరంలోని మహానాడు కాలనీకి చెందిన శ్రీనివాస్, అదే ప్రాంతానికి చెందిన ఫార్మసీ విద్యార్దిని జ్యోతి ప్రేమించుకున్నారు. రాజధాని అమరావతిలోని నవులూరు గ్రామ శివారులోని క్రీడా స్టేడియం ప్రాంతంలోకి గత రాత్రి ఇద్దరూ వెళ్లారు..ఈ ప్రేమ జంటను గమనించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రియుడి పై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డట్టు తెలుస్తోంది...ఈ ఘటనలో యువతి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందగా యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుకులాడుతున్నాడు..ఇద్దరినీ మంగళగిరి ఆసుపత్రి కి తరలించారు..యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు...పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు...