పాత గుంటూరులో ఉద్రిక్తత...144 సెక్ట‌న్ కొన‌సాగింపు..!

ఎపి వెబ్ ప్యూస్.కామ్...

గుంటూరు న‌గ‌రంలోని పాత గుంటూరు పోలీస్‌స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.పాత‌గుంటూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో ఓ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే యువకుడితో పోలీసులు లాలూచీప‌డి అత‌న్ని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అనుమానం వ్యక్తం కావ‌టంతో బాలిక కుటుంబ స‌భ్యులు, బందువులు పోలీస్ స్టేషన్ వ‌ద్ద నిర‌స‌న తెలిపారు...అయినా పోలీసుల తీరు త‌మ‌కు న్యాయం చేస్తార‌ని న‌మ్మ‌కం క‌ల‌గ‌క‌పోవ‌టంతో నిందితుణ్ణి త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు తమ లాఠీలకు ప‌నిచెప్పి లాఠీచార్జ్ చేశారు. పోలీసులు లాఠీ ఛార్జి చేయ‌టంతో ఆగ్రహించిన బాలిక బంధువులు, స్థానికులు పోలీస్‌ స్టేషన్‌పై రాళ్లదాడి చేశారు. పీఎస్ అద్దాలు ధ్వంసం చేశారు...దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీ ఛార్జి చేయ‌టంతో విషయం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకున్న అర్బన్ ఎస్పీ విజయరావు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆందోళనకారులతో ప్రస్తుతం ఆయన చర్చలు జరుపుతున్నారు.నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు . అస్పత్రికి తరలించారు....

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.