ఏపీ సమగ్ర శిక్షా అభియాన్‌ ఆవిర్భావం ..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

ప్రస్తుతం జిల్లా విద్యా వ్యవస్థలో సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), ఉపాధ్యాయ విద్య (సీసీఎస్‌టీఈ) పథకాలన్నీ వేర్వేరుగా నడుస్తున్నాయి.

నిధులు ఏ విభాగానికి చెందిన వారే వినియోగించాల్సి ఉంటోంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా వీటన్నిటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి ఉన్నత విద్యాప్రమాణాలు పాదుకొల్పాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. సంచాలకురాలు సంధ్యారాణి దీనిపై ముమ్మరంగా కసరత్తు చేశారు. ఎట్టకేలకు ఈ పథకాలన్నీ విలీనం చేసి  ఏపీ సమగ్ర శిక్షా అభియాన్‌ పథకంగా తెరమీదకు తెచ్చారు. స్వయంప్రతిపత్తి గల స్వతంత్ర సంస్థగా ఇది ఇక నుంచి నడుస్తుందని అధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.