మార్చి31లోపు పూర్తి చేయాలి

మార్చి31లోపు పూర్తి చేయాలి 

మోదా(పరిగి), న్యూస్‌టుడే: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని మార్చి 31లోపు పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జేసీ-2 ఖాజామొయిద్దీన్‌ సూచించారు. శనివారం మండల పరిధిలోని మోదాలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొనేంత వరకు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారి నాగరంగయ్య, తహసీల్దార్‌ సుబ్బారెడ్డి, ఎంపీడీవో బాలమునయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ ఎన్‌.కుమార్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

గాడ్రాళ్లపల్లి(చిలమత్తూరు): ప్రజలు మరుగుదొడ్లు వేగవంతంగా నిర్మించుకోవాలని ఉద్యానశాఖ ఉప సంచాలకులు సుబ్బరాయుడు కోరారు. దేమకేతేపల్లి పంచాయతీలో ఆయన శనివారం పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లు వేగవంతంగా నిర్మించుకోకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని తెలిపారు. చిలమత్తూరు పంచాయతీ సంజీవరాయనపల్లి, పాతచామలపల్లి, కొత్తచామలపల్లి గ్రామాల్లో ఉపసర్పంచి చంద్రారెడ్డి మరుగుదొడ్లు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఉపసర్పంచి ఇంటి ముందు పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు సన్యసిరావు, మండల ప్రత్యేకాధికారి శుభదాస్‌, జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి, ఇన్‌ఛార్జి ఎంపీడీవో రమణ విన్నూతరీతిలో నిరసన వ్యక్తం చేశారు. మరోమూడు రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేయిస్తానని ఉప సర్పంచి హామీ ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు వైస్‌ ఛైర్మన్‌ గంగప్ప, తెదేపా నాయకుడు రామనాథరావు, ఉపాధిహామీ జేఈ అశ్వర్థనారాయణ, వీఆర్వో ఉమామంజునాథరావు, ఉద్యాన ఎంపీఈవో కృష్ణవేణి, ఏఈవో మల్లికార్జున్‌, క్షేత్ర సహాయకుడు నాగరాజు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

©2018 ApWebNews.com. All Rights Reserved.