జలగండం!

ఎపి వెబ్ న్యూస్.కామ్

న్నహోబిలం సమతుల జలాశయంలో (పీఏబీఆర్‌) నీటి నిల్వ 1.737 టీఎంసీలు మాత్రమే. దీనిపై 792 గ్రామాలు, అనంత నగరం, హిందూపురం, కళ్యాణదుర్గం పట్టణాలు ఆధార పడ్డాయి.

రోజూ 70 క్యూసెక్కుల నీరు వాడేస్తున్నారు. ఇదే స్థాయిలో నీరు వాడితే వేసవిని గట్టెక్కేది కష్టమే.

మధ్యపెన్నార్‌ జలాశయంలో (ఎమ్పీఆర్‌) మరీ దారుణం. ఇక్కడ 0.243 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ జలాశయంపై శింగనమల, బీకే సముద్రం, నార్పల మండలం బి.పప్పూరు నీటి పథకాలు, మరో 45 గ్రామాలు ఆధార పడ్డాయి. ఇక్కడ నీరు అడుగంటడంతో తాగునీటికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది.

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లాలో కీలకమైన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగం టుతున్నాయి. మండే ఎండల ప్రభావం బాగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ఆవిరి రూపంలో నీటి నిల్వ తగ్గుతోంది. దీనికితోడు రోజూ తాగునీటికి నిల్వలను ఎడాపెడా వాడేస్తున్నారు. ఈక్రమంలో జలాశయాల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. వీటి ప్రభావం తాగునీటిపై పడుతోంది. కనీసం ఈ వేసవి కాలం దాటుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. జిల్లాలో చిత్రావతి జలాశయంతో కలిపి తొమ్మిది కీలకమైన జలాశయాలు ఉన్నాయి. చిత్రావతిలో పర్వాలేదు. తక్కిన ఎనిమిది జలాశయాల్లో పూర్తి స్థాయిలో 
నీటి మట్టం తగ్గింది. జిల్లాలో సగం ప్రాంతాలకు తాగునీరు అందించే పీఏబీఆర్‌లోనూ క్రమేపీ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. దీని తర్వాత మధ్యపెన్నార్‌ జలాశయంలో (ఎమ్పీఆర్‌) కూడా నీటి నిల్వలు అడుగు అంటాయి. ఈ రెండింటిలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయి. మొన్నటి ఖరీఫ్‌ సీజన్‌లో ఎడాపెడా నీటిని వాడేయడమే దీనికి మూలం. ఇప్పుడు ఉన్న అరకొర నిల్వలను కూడా ఇష్టానుసారం వడేస్తుండటంతో తాగునీటిపై ప్రభావం కనిపిస్తోంది. ఇంకా మూడు నెలలపాటు తాగునీటి సమస్య లేకుండా చూడాల్సి ఉంది. ఆగస్టు రెండో వారంలోనే జలాశయాల్లోకి నీరు వస్తుంది. అప్పటి దాకా నీటి కొరత తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. కానీ... అప్పటి దాకా సమస్య రాకుండా ఎలా నియంత్రిస్తారోనన్నది ప్రశ్నార్థకం.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.