జంతుప్రదర్శన శాల మరింత అభివృద్దికి ప్రణాళిక సిద్దం చేయాలి - సిద్ద రాఘవ రావు..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

రిపోర్టర్:- మునిబాబు

ప్రముఖ యాత్ర స్థలం తిరుపతి  ఎస్ వి జంతుప్రదర్శన శాల  మరింత  అభివృద్ది పరచి  పర్యటకులను ఆకట్టుకునే విధంగా  ప్రణాళిక సిద్దం చేయాలని  రాష్ట్ర  అటవీ శాఖ  మంత్రి సిద్ద రాఘవ రావు అన్నారు.

సోమవారం మధ్యాహ్నం ఎస్.వి.జంతు ప్రదర్శన శాలలో జరిగిన  64వ వన్య ప్రాణి సప్త  కార్యక్రమం ముగింపు కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం   జంతుప్రదర్శన శాల  పరిపాలన భవనం లో జంతుప్రదర్శన శాల  పై సమీక్షించారు.  ఈ సందర్బంగా మంత్రి ఆధికారులకు వివరిస్తూ  కొత్త రాష్ట్రం  మనది, కొత్తదనం తో ముందుకు పోవాలని రోడ్లను సిమెంట్  రోడ్లు గా మార్చాలని,  పర్యటకులను ఆకర్షించడమే  లక్ష్యం గా  బడ్జెట్ తో పని లేకుండా  ప్రణాళికలు సిద్దం చేసి త్వరలో సమర్పించాలని పి. సి .సి. ఎఫ్. వైల్డ్ లైఫ్  నళిని మోహన్ ను ఆదేశించారు.  ఇదే రీతి లో  విశాఖ జంతుప్రదర్శన శాల ను  కూడా  అభివృద్ది పరుస్తున్నామని తెలిపారు. యాత్రికులు సేద తీరేలా బస చేసేలా జంతుప్రదర్శన శాల   ఎదురుగా వున్న స్థలం లో  వసతి గదుల ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టాలని తెలిపారు.  జంతుప్రదర్శన శాల లో వున్న 1800 ఆనిమల్స్ తో పాటు ఇతర రాష్ట్రాల, దేశాల  జంతుప్రదర్శన శాలను సంప్రదించి  కొత్త వన్య ప్రాణులు  ఏమైనా తీసుకొని రాగలుగుతామో   చూడాలన్నారు. ప్రణాళిక సిద్దంచేయడంలో  ఆర్థికంగా ఎంత అనేది అవసరం లేకుండా  ఏమేరకు అభివృద్ది చేయగలమో  ప్రణాళిక రూపొందించాలని   అందుకయ్యే ఖర్చు ప్రభుత్వం పరిశీలించి  పి. పి. పి. ద్వారానా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులా అని ఆలోచించడం జరుగుతుందని  అన్నారు.  ఈ సమీక్ష లో పి సి సి ఎఫ్ వైల్డ్ లైఫ్  నళిని మోహన్, సి సిప్   శరవణన్  జంతుప్రదర్శన శాల  క్యురేటర్ బబిత వున్నారు. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.