కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.
- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుతారు.
- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొకూడదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయకూడదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).
- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింప కూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండకూడదు. .
- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కకూడదు.
- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినకూడదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినకూడదు.
- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకి వెళ్ళకూడదు .

- కళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి. దానివలన దీర్ఘాయువు కలుగుతుంది. తడి కాళ్ళతో నిద్రించ కూడదు.  

మధ్యధరా సముద్ర ప్రాంతాన ప్రేమ,కరుణ, క్షమలకు దూరమై, అశేష ప్రజానీకం, ఆకలిదప్పులు, రోగాలు, బాధ లు, కష్టాలు, కన్నీళ్ళులో మునిగి తేలుతు న్నారు.

మనలో దాదాపు అందరం ఏదో సందర్భంగా ఆలయానికి వెళతాం. దైవానికి నమస్కరిస్తాం. తోచిన రీతిలో పూజలు చేస్తాం. నిజానికి ఆలయంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ మన మనసులో అనేక సందేహాలు మొదలవుతాయి.

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న వృత్తాంతం ఏమిటో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్ ను ఆదేశించారు.

ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె.. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కోడతాడు.

గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమై పోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేన  గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద -పచ్చకర్పూరం పెడుతున్నారు.

లక్ష్మీదేవీ కటాక్షం కోసం చేయలసినవి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సంధ్యాసమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకుండా, దానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. దేవీదేవతలకు ధూప, దీపహారతులు ఇవ్వాలి. ఏ పని కోసమైనా ఇంటినుండి బయటకు వెళ్ళేముందుగా, ఇంటిని చీపురుతో శుభ్రం చేసుకోవాలి. పరగడుపున కార్యార్థం బయటికి వెళ్ళకూడదు. కనీసం చెంచా తీయని పెరుగును నోటిలో వేసుకునే వెళ్ళాలి. ఇలా చేయడం వలన మీరు అనుకున్న కార్యాలు శుభంగా జరుగుతాయి. 

లక్ష్మీకటాక్షాన్ని దక్కించుకోవాలంటే మహాలక్ష్మీకి తులసి పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పుపైపుగా ఉండాలి. గురువారం రోజు ఏ మహిళనైనా పిలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటిదానం చేయాలి. దీన్ని క్రమబద్ధం చేసుకుంటే మంచిది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ధన సంబంధమైన కార్యాలన్నింటికీ సోమవారం, బుధవారలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. 
 
ప్రతి శనివారిం ఇంటిని శుభ్రపరుచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువులన్నీ సర్ది చక్కబరుచుకోవాలి. మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు, శ్రీ గణేశుడిని ఉంచాలి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్లుగా ఉంచాలి. ఇలా ఇంటిని సర్దేసి, శుభ్రం చేసుకుంటే తెల్లవారు, సంధ్యాసమయాల్లో దీపాలను వెలిగించి, నిష్ఠతో పూజచేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా ధనవంతులవుతారు.

 

హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు :

పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు "ఏలసరాజు". ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది.

తాజా వార్తలు

©2018 APWebNews.com. All Rights Reserved.