షణ్మతాలు అంటే ఏమిటి?

ప్రాచీన వైదిక ధర్మంలో వేర్వేరు ఆరాధనా పద్ధతులున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఆరు. అవి శైవం, వైష్ణవం, శక్తి ఆరాధన, సూర్యారాధన, గాణాపత్యం, అగ్ని (స్కందుడు) ఆరాధన. వీటిని ‘షణ్మతాలు’ అంటారు.

ఈ పద్ధతులను అనురించేవారి మధ్య విభేదాలు కూడా తీవ్రంగానే ఉండేవి. ఆది శంకరులు వాటిని పరిష్కరించడానికి కృషి చేశారు. ఆ మతాలను (ఆరాధనా పద్ధతులను) పాటించేవారందరినీ ఒక తాటి మీదికి తీసుకువచ్చారు. వాటన్నిటికీ వేదాలే మూలమని ఒప్పించారు. దైవారాధనలో అగ్నిని తప్పనిసరి చేశారు. మిగిలిన ఆరాధకులు తమ ఇష్టదేవాలను మధ్యలో ఉంచి, మిగిలిన దైవాలను ఒక్కో దిక్కులో ఒక్కరిని నిలిపి ఆరాధించే ‘పంచాయతన’ పూజా విధానానికి రూపకల్పన చేశారు. అందుకే శంకరులను ‘షణ్మత స్థాపనాచార్య’ అని పిలుస్తారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.