మౌన వ్రతం ఎందుకు ఆచరిస్తారు.?

మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేర్జియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం.

శరీరాన్ని ఎవ్వరూ తాకకుండా, కళ్ళతో ఏదీ చూడకుండా, చెవులు వేటినీ వినకుండా, నాలుక ఏమీ మాట్లాడకుండా, లేక ఘన ఆహారం ఏమీ తినకుండా, ముక్కుతో ఉచ్వాస - నీచ్వాస క్రమాలు, క్రమబద్దీరకంగా ఉండగలిగి, ఇవేకాక, శరీరంలోని మిగితా ఇంద్రియాలన్నే కలిపి, దశ ఇంద్రియాలు కూడా పూర్తిగా మౌనం పాటించడం, నిజమైన మౌన వ్రతం పాటించడం.

అందుకే మౌన వ్రతం పాటించేటప్పుడు, ద్రవ ఆహారం తీసుకోవాలి అంటారు కానీ ఘన ఆహారం కాదు. కడుపు నిండితే నిద్ర పోతామే తప్ప, ఇంక దైవ ధ్యానం పై ఆసక్తి ఎక్కడ ఉంటుంది? ఇంత నిష్టగా చేసే మౌన వ్రతం, ఒక్క క్షణం చేసినా చాలు. మనం పుట్టిన నాటి నుంచీ, జీవించి ఉన్నంతకాలం, నిరంతరం ఆగకుండా పని చేసే ఏకైక యంత్రం, మన శరీరం. మరి ఈ శరీరాన్ని మౌన వ్రతం వల్ల అయినా, కనీసం కాసేపైనా సరే, విశ్రాంతి తీసుకునేలా చేసుకోగలిగితే, "దేహమే దేవాలయం" అన్నవాఖ్యానికి నిర్వచనం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలా విశ్రాంతి తీసుకున్న మనసు - శరీరానికి, హీలింగ్ పవర్ పెరిగి, మరింత ఉత్సాహాన్ని పుంజుకుని, శరీరం పని చేస్తుంది. అందుకే, "మౌన వ్రతం" చేస్తున్నాం అంటూ, అన్ని పనులూ చెయ్యడం, టీవీలు చూడటం, పాటలు వినడం, కుట్లు - అల్లికలు, లేక అర్ధం లేని ముచ్చట్లలో పాలు పంచుకోవడం, మనకెంతమాత్రం మేలు చెయ్యదు సరికదా? ఒక విధంగా హానే చేస్తుంది...

©2019 APWebNews.com. All Rights Reserved.